గోదావరిలో దిగవద్దని హెచ్చరిక

రంపచోడవరం  ముచ్చట్లు:

గోదావరి ఎక్కువ ఉన్నందున ఎవరైనా గోదావరి దగ్గరకువెళ్లిన, అనుమతి లేకుండా నాటు పడవలుఫై తిరిగిన అటువంటి వారి ఫై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం హెచ్చరించారు. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో రంపచోడవరం సబ్ కలెక్టర్ కట్ట సింహాచలం మాట్లాడుతూ గోదావరి పరివాహ ప్రాంతాలలో గోదావరి చూడడానికి వచ్చిన ప్రజలు, గోదావరిలో దిగవద్దని, అనుమతి లేకుండా నాటు పడవల ఫై ప్రయాణించే వారి గుర్తించి అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు, గోదావరి రోజురోజుకు పెరుగుతున్న సందర్భంగా గోదావరిలో ఎవరు కూడా గోదావరిలో  దిగవద్దని ప్రజలను సబ్ కలెక్టర్ కోరారు, గోదావరి ఎక్కువ ఉన్నందున ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు గమనించుకోవాలని గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు గోదావరి దగ్గరికి రావద్దని సబ్ కలెక్టర్. పేర్కొన్నారు.

 

Tags: Warning not to get down in Godavari

Leave A Reply

Your email address will not be published.