వాచ్ మెన్ సజీవదహనం…నలుగురు ఆరెస్టు

Date:14/12/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

నార్త్ జోన్ పరిధిలోని  బోయిన్పల్లిలో వాచ్మెన్పై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరించారు. ‘వారం క్రితం బోయిన్పల్లిలో వాచ్మెన్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వివాదాస్పద స్థలానికి కాపలా ఉన్న వ్యక్తిపై నిందితులు పెట్రోల్ పోశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాపలాదారుడు మృతి చెందాడు. డిసెంబర్ 7న ఈ ఘటన జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశాం’ అని సీపీ తెలిపారు. అలాగే రిధే సిద్ధి జ్యూవెలర్స్లో చోరీకి పాల్పడిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను కూడా సీపీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి రూ.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు  తెలిపారు. నిందితులపై ఇప్పటికే 11 కేసులు ఉన్నట్లు వెల్లడించారు.

 

లాభసాటి వ్యవసాయనికి ఏర్పాట్లు

 

Tags:Watchmen are alive … Four Arrest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *