భారీ వర్షాలతో ప్రాజెక్టులలోకి వచ్చి చేరుతున్న నీరు

హైదరాబాద్ ముచ్చట్లు:

 

సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువ నుంచి వరదలతో ప్రాజెక్టులోకి 5972 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం జలాశయంలో 17.001 టీఎంసీల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.91 టీఎంసీలు.
నిండుతున్న జూరాలజోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కర్ణాటకలో ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈక్రమంలో గత రెండు రోజులుగా జూరాల ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 318.400 మీటర్ల వరకు నీరు మట్టం ఉన్నది. దీంతో నీటి నిల్వ 9.418 టీఎంసీలకు చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 15,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది.

 

 

 

 

20,809 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా నదిలోకి (శ్రీశైలం వైపు) 17,264 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహంశ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం వస్తున్నది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. ఎగువనున్న జురాల ప్రాజెక్ట్‌ నుంచి 17,264 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 3,309 క్యూసెక్కుల ప్రాజెక్టులోకి వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 809.02 అడుగులు మేర నీరుంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 33.8613 టీఎంసీల నీరుంది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి ప్రస్తుతం నిలిచిపోయింది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Water coming into projects with heavy rainfall

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *