అంతర్జాతీయ విమానాశ్రయంలో నీటి ఇక్కట్లు

-ఎరక్కపోయి ఇరుక్కున్నవైనం
 
తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో నీటి ఇక్కట్లు ఏర్పాడ్డాయి. దానికో వింత కారణముంది. ఇంతకుముదు మంత్రి బొత్స సత్యనారాయణ కు స్వాగతం పలికేందుకు అధికారపార్టీ యువనేత వచ్చారు. అయనను విమానాశ్రయంలోకి ఒక ఉద్యోగి అనుమతించలేదు. తనకు ప్రోటోకాల్ ఉందంటూ యువనేత వాగ్వాదం చేసాడు. చివరకు ఉన్నతాధికారి జ్యోక్యంతో యువనేత విమానాశ్రయంలోకి వెళ్లాడు. పోతూపోతూ తన తడాఖా చూపుతానంటూ సవాల్ విసిరాడు. రాత్రికి రాత్రే తిరుపతి విమానాశ్రయానికి, ఉద్యోగుల నివాస గృహాలకు నగరపాలక సంస్థ నీటి పంపిణీ ఆపేసింది. విమానాశ్రయ ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు రోజుకు 18 ట్యాంకర్లు నీటిని ఎయిర్ పోర్ట్ అధికారులు కొనుగోలు చేస్తున్నారు. నీటి సమస్య పరిష్కారానికి ఎయిర్ పోర్ట్ అధికారులు నగర పాలక సంస్థ చుట్టూ తిరుగుతున్నారు. అయినా సదరు యువనేత మాత్రం అనుగ్రహించడం లేదని సమాచారంని
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Water dilemmas at the international airport

Natyam ad