పుంగనూరు ప్రజలకు సమ్మర్‌స్టోరేజ్‌ ద్వారా జనవరిలో నీరు

Water for the people of Punganur by SummerStoreage

Water for the people of Punganur by SummerStoreage

– ఎస్‌ఈ మోహన్‌

Date:20/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

సుమారు పది సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోని సమ్మర్‌స్టోర్‌జ్‌ ట్యాంకు నుంచి జనవరి నెలలో ప్రజలకు మంచినీరు సరఫరా చేస్తామని పబ్లిక్‌ హెల్త్ ఎస్‌ఈ మోహన్‌ తెలిపారు. బుధవారం ఆయన పట్టణంలోని సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకును, పైపులైన్లను, ఇందుకోసం అవసరమైన మోటార్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు పనులను చురుగ్గా చేపట్టామన్నారు. సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు హంద్రీనీవా నీటిని విడుదల చేస్తామన్నారు. పట్టణ ప్రజలకు శాశ్వత దాహార్తి తీర్చేందుకోసం సుమారు పది సంవత్సరాల క్రితం నిర్మించిన సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు జనవరిలో నీటిని విడుదల చేస్తామన్నారు. ఇందుకోసం అవసరమైన మోటార్లు కొనుగోలు చేస్తున్నామన్నారు. అలాగే కట్టపై భాగంలో నాలుగు వైపుల చెట్లను తొలగించి, తారు రోడ్డు వేయాలని మంత్రి ఆదేశించారని, ఈ మేరకు పనులు చేపట్టామన్నారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శేషసాయి, డిఈ గోపాలకృష్ణ, ఏఈలు కృష్ణకుమార్‌, హితేశ్వర, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్ధవ్ కు సీఎం పోస్టు తీరని కోరికేనా

 

Tags; Water for the people of Punganur by SummerStoreage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *