సాగర్ ఎడమ కాలువనుంచి నీరు విడుదల

నల్గోండ ముచ్చట్లు:


నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి నీటిని మంత్రి జగదీష్ రెడ్డి గురువారం విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి  శాసనసభ్యులు  నోముల భగత్, శానంపూడి సైదిరెడ్డి,శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్ తదితరులు హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ దశాబ్దా కాలం తరువాత జులై లో నీటి విడుదల చేస్తున్నాం. జులైలో విడుదల చేయడం రెండు దశాబ్దాల రెండు సంవత్సరాలలో ఇది ఇదో సారి. స్వరాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇదే జులై లో విడుదల చేయడం ఇదే ప్రధమం. 6.50లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలుసిద్దం చేసాం. ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట,ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఏకరాలలో సాగు జరుగుతోంది. నల్లగొండ జిల్లాలో1.45,727 ఎకరాలు,సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు,ఖమ్మం జిల్లాలో(ఎత్తిపోతల తో కలుపుకుని2,41,000 వేల ఎకరాలు సాగు జరుగుతోంది. టి యం సి ల వారిగా నల్లగొండ జిల్లా కు18 టి యం సి లు సూర్యాపేట జిల్లాకు 18 టి యం సి లు ఖమ్మం జిల్లాకు 29 టి యం సి లు వస్తాయి. కృష్ణా జలాల వాటాలో తెలంగాణ ప్రభుత్వం  నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. తద్వారా ఆయకట్టు రైతాంగానికి సకాలంలో నీరు  అందుతుంది. సాగర్ జలాశయానికి కిందటేడాదితో పోలిస్తే నీరు  అదనంగా వచ్చి చేరుతుందని అన్నారు.

 

Tags: Water is released from the left canal of Sagar

Leave A Reply

Your email address will not be published.