పోతిరెడ్డిపాడు ముచ్చట్లు:
పోతిరెడ్డిపాడు నుండి ఎందుకు 25 వేలకే పరిమితం అయింది, 44 వేలు ఎందుకు వదలడం లేదు.పొతిరెడ్డి పాడు నుండి కర్నూలు, కడప జిల్లాల్లో ఉన్న జలాశయాలకు గ్రావిటీ ద్వారా నీరు వెళ్తుంది.మొదటగా వెలుగోడు 16 టిఎంసి సామర్థ్యం ఉన్న బ్యాలెన్సింగ్ జలాశయం, దీని ముఖ్య ఉద్దేశ్యం తెలుగుగంగ కి నీటిని తరలించడం అలాగే కుందూ ఆయకట్టు స్థిరీకరణ కొరకు. ఈ జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. వరద ఉన్నప్పుడు అత్యధికంగా 18 వేల క్యూసెక్కుల వరకు వదిలి పూర్తిస్థాయిలో నింపినారు. ఇప్పుడు ఈ జలాశయం నుండి 5000 వేలు తెలుగుగంగ కి, ఇంకో నాలుగు వేలు గాలేరు నదిద్వారా కుందూ కి వదిలి అటుపై సోమశిల కి వదులుతున్నారు.ఇంకో ముఖ్యమైన జలాశయం గోరకల్లు. దీని ముఖ్య ఉద్దేశ్యం శ్రీశైలం కుడి కాల్వ మీద ఉన్న ఆయకట్టు స్థిరీకరణ. అంటే ఇక్కడ నుండి అవుకు జలాశయం, అటుపై గండికోట జలాశయానికి నీటిని విడుదల చేస్తారు. దీనికి బనకచెర్ల నుండి సుమారుగా 12000 క్యూసెక్కుల నీరు తరలించే సామర్థ్యం ఉన్న కాల్వలు ఉన్నాయి. ఈ జలాశయం కూడా దాదాపుగా పూర్తిస్థాయిలో నిండి అవుకు జలాశయానికి 11400 నీటిని విడుదల చేస్తున్నారు. బనకచెర్ల నుండి కూడా అదేమొత్తం లో ఈ జలాశయానికి విడుదల చేస్తున్నారు.ఇకపోతే మూడో దారి నిప్పులవాగు, కుందూ.. ఈ నిప్పులవాగు కుందులో కలిసి కుందూ ఆయకట్టు నీరు ఇవ్వడం తో పాటు పెన్నాలొ కలిసి సోమశిల లో కలుస్తుంది. కుందూ వెడల్పు ప్రక్రియ పూర్తికానందున ఇక్కడ కూడా 12 వేల క్యూసెక్కుల కంటే ఎక్కువ విడుదల చెయ్యలేరు.పైన చెప్పిన కారణాల వలన ఇప్పుడు 25 వేల కంటే ఎక్కువ వదిలే అవకాశం పోతిరెడ్డిపాడు దగ్గర ఉన్నా, వాటిని తరలించి సామర్థ్యం కాల్వలకు లేదు కాబట్టి తక్కువగా వదులుతున్నారు.
Tags: Water is supplied by gravity to reservoirs in Kurnool and Kadapa districts