Natyam ad

జలమే జెండా

నల్గోండ ముచ్చట్లు:


జలమే జెండా అయ్యింది. కృష్ణమ్మ పరవళ్లు.. మువ్వెన్నల పతాకమై ఎగురుతూ.. ఎగిసి పడింది. ఈ అరుదైన, అందమైన దృశ్యం అందర్నీ మంత్రముగ్దులను చేసింది. అసలే నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు తెరిచారంటే.. ఆ అందాలు ఎంత చూసినా తనివి తీరదు. విద్యుత్ కాంతుల్లో, అందుల్లోనూ జాతీయ జెండా రంగుల కాంతుల్లో ఎగిసి పడుతున్న సుందరమైన దృశ్యాన్ని చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు. ఇప్పటికే నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు 26 కి 26 గేట్లు ఎత్తేశారు. ఆ గేట్లకు జెండా రంగుల లైట్లను అమర్చారు డ్యామ్ అధికారులు. 8 గేట్లకు కాషాయ,10 గేట్లకు తెలుపు, మరో 8 గేట్లకు ఆకుపచ్చ రంగు గల లైట్లను అమర్చారు. లేటెస్ట్ ట్రెండ్ లో భాగంగా ఈ దృశ్యం స్పెషల్ అట్రాక్టన్ గా నిలిచింది. సాగర్ అందాలు చూడడమే కాదు.. విద్యుత్ వెలుగుల్లో జాతీయ జెండా రంగులు విరాజిల్లుతున్న కృష్ణమ్మ పరవళ్లకు సగర్వంగా చెయ్యిత్తి నమస్కరిస్తూ భక్తి భావం చాటుకుంటున్నారు పర్యాటకులు. డ్యామ్ చరిత్రలో తొలిసారిగా కనిపించిన ఈ సుందరమైన దృశ్యం కనువిందు చేస్తుండడంతో సాగర్ కు పరుగులు పెట్టారు ప్రకృతి ప్రేమికులు.

 

Tags: Water is the flag

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.