తిరుమల  జలాశయాల్లో పెరిగిన నీటిమట్టం

Date:24/11/2018
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ఇటీవల గత మూడు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలకు జలశయాల్లో నీటిమట్టం పెరిగి, భక్తుల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. తిరుమలలోని జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం  7,269 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. నవంబరు 21వ తేదీ ఉదయం నుండి 24వ తేదీ ఉదయం వరకు తిరుమలలో 144 మిల్లీ మీటర్ల వర్షం నమోదుకాగా, తద్వారా 1,800.49 లక్షల గ్యాలన్ల నీరు అన్ని డ్యామ్లలోనికి చేరింది.  తిరుమలలో భక్తులకు సరాసరిన రోజుకు 30.8 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది. తిరుమలలో గోగర్భం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార మరియు పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఈ జలాశయాల్లో డెడ్ స్టోరేజిని మినహాయిస్తే మొత్తం 5,816 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది.  తిరుమలలోని డ్యామ్లలో దాదాపు 6 నెలలకు సరిపడా నీరు నిల్వ ఉంది. తిరుపతిలోని కల్యాణి డ్యామ్లో రోజుకు సరాసరి 8 ఎంఎల్డి నీటిని వినియోగించుకుంటున్నాము. కావున దాదాపు 441 రోజులు వరకు భక్తుల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గోగర్భం డ్యామ్ పూర్తి నిల్వ సామర్థ్యం 2,683 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 501 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. పాపవినాశనం డ్యామ్ పూర్తి నిల్వ సామర్థ్యం 5,215 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 2825 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. ఆకాశగంగ డ్యామ్ పూర్తి నిల్వ సామర్థ్యం 685 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 103 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. కుమారధార మరియు పసుపుధార డ్యామ్ పూర్తి నిల్వ సామర్థ్యం 5,845 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 3,840 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది.
Tags:Water level in Thirumala reservoirs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *