రాతన గ్రామంలో నీటి కష్టాలు తీరేది ఎన్నడో…
పత్తికొండ ముచ్చట్లు:
తుగ్గలి మండలం రాతన గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత పది రోజుల నుండి అధికారులు, సర్పంచ్ దృష్టి కీ తీసుకెళ్లినా పైప్ లైన్ మరమ్మతులు చేయకపోవడం పై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో దాదాపు రెండువేలు కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పూర్తి చేయడం కోసం గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన ఫలితం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బందికి పదేపదే చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. త్రాగు నీటి కోసం గ్రామ సమీపంలోని చెరువు దగ్గరకు ఉన్న బోర్ వెళ్లి
ఎడ్ల బండ్లు కట్టుకొని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నా. అధికారులు స్పందించడం లేదు గ్రామ ప్రజలు మా గ్రామంలో తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదు. గత పది రోజుల నుండి త్రాగు నీటి కోసం ఇబ్బంది పడుతున్నాము. రోజు చెరువు దగ్గర లోని బోరు వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవడం కష్టంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలి. అని గ్రామ ప్రజలు కోరుతున్నారు

Tags;Water problems in Ratana village were never solved…
