Natyam ad

వేసవిలో నీటి సమస్యలు సత్వరమే పరిష్కరించాలి- ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాలలో వేసవి కారణంగా నీటి సమస్యలు ఉత్పన్నమౌతుందని , వాటిని అలసత్వం చేయకుండ సత్వరమే పరిష్కరించాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీవో మునిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అతిధులుగా పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, బోయకొండ చైర్మన్‌ నాగరాజారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాగాండ్లపల్లెలో కరెంటు సక్రమంగా సరఫరా కావడం లేదని ఎంపీటీసీ నాగభూషణరెడ్డి కోరారు. అలాగే సింగిరిగుంట లో నీరు వృధా అవుతోందని కొళాయిలు ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ ఆంజప్ప కోరారు. అలాగే షీకారిపాళ్యెం, కమ్మవారిపల్లె, ఓబిరెడ్డిపల్లి, ఆరడిగుంట, సుగాలిమిట్ట ప్రాంతాలలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని సభ్యులు తెలిపారు. అలాగే రైతులకు టమోటా ట్రేలు కావాలని, వెహోక్కలకు పాలిథీన్‌ కవర్లు ఇవ్వాలని కోరారు. అలాగే డ్రిప్‌ఎరువులను ఆర్‌బికెల ద్వారా పంపిణీ చేపట్టాలని కోరారు. ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు సమస్యలను గుర్తించి రెండురోజుల్లో పరిష్కరించాలన్నారు. తీవ్రమైన సమస్యలు ఎదురైతే రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎలాంటి సమస్యలు వచ్చిన తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో సమస్యలు లేకుండ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు , ఆప్రాంత ప్రజాప్రతినిధులు , నాయకులు సమన్వయంతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వైస్‌ఎంపీపీలు ఈశ్వరమ్మ, సరోజమ్మ , కోఆఫ్షన్‌ మెంబరు బాబ్‌జాన్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Water problems should be solved quickly in summer- MPP Bhaskar Reddy

Post Midle