గత పాలకులతోనే నీటీ సమస్యలు మంత్రి ధర్మాన

శ్రీకాకుళం    ముచ్చట్లు :
వంశధార ప్రాజెక్టుకు ఆయువుపట్టు అయిన నేరడి బ్యారేజీ నిర్మాణానికి వంశధార ట్రిబ్యునల్ సానుకూలంగా తీర్పును వెల్లడించడంపై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హర్షం వ్యక్తం చేశారు. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చినా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే సమస్య జఠిలమైందని విమర్శించారు. ఏప్రిల్ 16వ తేదీన ఈ విషయమై ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాసి సమస్య పరిష్కారానికి ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు వచ్చి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారని గుర్తుచేశారు.శ్రీకాకుళం లో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా సాగునీటి అవసరాల కోసం వంశధార ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతోందని, ఈ దశలో కేవలం 106 ఎకరాల తమ భూమి ముంపునకు గురవుతోందని ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఎపి ప్రభుత్వం సదరు భూసేకరణకు అవసరమైన మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వంశధార నదికి ఎడమవైపున ఒడిశా భూభాగంలో బ్యారేజీకి స్లూయిస్ నిర్మించాలన్న ట్రిబ్యునల్ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని తెలిపారు. ట్రిబ్యునల్ సూచించిన విధంగా ఎనిమిది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్ నిర్మాణాన్ని రానున్న మూడేళ్లలో పూర్తి చేసి కీ.శే వైఎస్ రాజశేఖర్రెడ్డి కలలు గన్న వంశధార ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లా రైతాంగానికి అంకితం ఇస్తామని పేర్కొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Water problems with past rulers
Minister Dharmana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *