గుండి చెరువు ఎల్లంపల్లికి నీరు

Date:15/03/2018
కరీంనగర్ ముచ్చట్లు:
రామడుగు మండలంలోని గుండి, తిర్మలాపూర్ చెరువులకు  ఎల్లంపల్లి నీరు చేరింది.. నియోజకవర్గంలో రెండో అతిపెద్దదైన గుండి చెరువు నీటితో నింపడం ద్వారా గొలుసుకట్టు చెరువులైన రేవెల్లి, దేశాయిపేట, మంగళపల్లి గ్రామాల్లోని భూములకు సాగునీరందుతుంది. తద్వారా వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. తిర్మపూర్ గేట్‌వాల్వు ద్వారా వచ్చే నీటితో దీని పరిధిలోని చెరువు, కుంటతో పాటు గొలుసుకట్టులో సర్వారెడ్డిపల్లి చెరువుకు నీరు చేరుతుంది.గుండి చెరువు కట్టవరకూ చేరుకున్న ఎమ్మెల్యే బొడిగ శోభ ద్విచక్ర వాహనంపై సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో చెరువు పైభాగంలో ఉన్న ఎల్లంపల్లి పైపులైన్ గేట్ వాల్వు వద్ద కు చేరుకున్నారు. పైపులైన్ ద్వారా సంబంధిత అధికారులు నీటిని విడుదల చేయగా ఎమ్మెల్యే క ఏఎంసీ చైర్ పర్స న్ పూడూరి మణెమ్మ తదితరులతో కలిసి గోదారమ్మకు పసుపు, కుంకుమలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు. గుండి గ్రామానికి చెందిన పలువురు రైతు లు కొత్తనీరు చెరువులోకి చేరుతుండగా పండుగ చేసుకొంటూ యాటలను కోసుకున్నారు. అనంతరం ద్విచక్రవాహనంపై తిరామపూర్ అనుబంధ గ్రామాలు పెం చాలపల్లి, కారుపాకలపల్లి గ్రామాల మధ్య ఉన్న ఎల్లంపల్లి గేట్‌వాల్వు వద్దకు చేరుకొని నీటీని విడుదల చేశారు. రైతుల పంటలు ఎండకూడదనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుల శాఖ అధికారులను ఆదేశించి రాత్రి, పగలనక 24 గంటలు పనిచేసి కుంగిన నందిమేడారం కట్టను పునురుద్ధరించి ఎల్లంపల్లి నీటిని విడుదల చేశామని చెప్పారు. నిన్నటి వరకు రైతు ల్లో ఎల్లంపల్లి నీరు వస్తుందన్న నమ్మకం లేదన్నా రు. నేడు నీటిని విడుదల చేయడం ద్వారా ఆనం దంలో మునిగితేలుతున్నారని చెప్పారు. గుండి చెరువుపైన గేట్‌వాల్వు ద్వారా ఇక్కడి చెరువు నిం పుకొని అనంతరం గొలుసుకట్టు చెరువైన రేవెల్లి మినీ ట్యాంక్‌బండ్‌లోకి చేరుకొనేలా చర్యలు చేపట్టారు.
Tags: Water pump

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *