జల జీవన్ మిషన్ ద్వారా ఇంటికి నీటి కుళాయి-మోడీ ప్రభుత్వం లక్ష్యం

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ప్రతి ఇంటికి పైపుల ద్వారా సురిక్షత త్రాగు నీటి ని అందించాలనే దిశగా అడుగులు వేస్తూ ” జల జీవన్ మిషన్ ” పథకం క్రింద మన రాష్ట్రానికి ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వం రూ. 3.183 కోట్లు మంజూరు చేసిందని ప్రధాన మంత్రి జన కళ్యాణ్ కారి యోజన రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. మార్చ్ 2024 నాటికి దేశం లోని ప్రతి ఇంటికి త్రాగు నీరు అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. గతము తో పోలిస్తే ఈ సారి 4 రేట్లు అధికంగా మన రాష్ట్రానికి జల జీవన్ మిషన్ పథకం క్రింద నిధులు కేటాయించారు. దీని ద్వారా త్వరలోనే గ్రామాలలోని ప్రతి ఇంటికి త్రాగు నీటి కుళాయి సౌకర్యం అందుబాటు లోకి వస్తుంది.ప్రస్తుత సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.6.805.71 కోట్లు మేర నిధులున్నాయి. నిధులు లభ్యత అడ్డంకి కాదని, ఈ కార్యక్రమాన్ని మరింత వేగంగా అమలు చేయడం ద్వారా మన రాష్ట్ర ప్రజలకు మరింత సురక్షితమైన మంచి నీటి ని మనము ప్రజలకు అందించగలమని , ప్రధాని మోడీ కలను సాకారము చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేస్తున్నాను.ఈ నిధులు త్వరితగతిన మన రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ కు ప్రత్యక కృతజ్ఞతలు పుంగనూరు పట్టణ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఇమెయిల్ ద్వారా తెలిపారు.

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Water tap-home Modi government aims through Jala Jeevan Mission

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *