Date:16/10/2020
సూర్యాపేట ముచ్చట్లు:
మరోసారి మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నీట మునిగే ప్రమాదం ఏర్పడింది. కృష్ణ నది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జునసాగర్ కు భారీగా ఇన్ ఫ్లో వస్తుంది.
దీంతో నాగార్జునసాగర్ నుండి ఆరు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ నుండి భారీగా ఔట్ ఫ్లో వస్తుండడంతో పులిచింతలకు భారీగా ఇన్ ఫ్లో పెరిగింది.
ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరడంతో పులిచింతల బ్యాక్ వాటర్ భారీగా వచ్చి చేరుతుంది దీంతో గత ఏడాది లాగానే మరోసారి మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీ
నరసింహస్వామి ఆలయం లోకి నీరు ప్రవేశించే అవకాశం ఉంది దీంతో ముందుచూపుగా ఆలయ అధికారులు ఆలయంలో ఉత్సవ విగ్రహాలను బయటకు తరలించారు. శాస్త్రోక్తంగా పద్ధతి
ప్రకారం ఆలయ అర్చకులు, అధికారులు ఈ తంతు పూర్తి చేశారు. గర్భాలయంలో ఉన్న ఉత్సవ మూర్తులు, కౌతుక మూర్తులు, సుదర్శన పెరుమాళ్లు, గోదాదేవి, శ్రీకృష్ణుని విగ్రహాలను,
స్వామి వారి వెండి బంగారు ఆభరణాలను శాస్త్రోక్తంగా మద్రాస్ వారి మఠానికి తరలించారు.
నిజాం సాగర్ కు పోటెత్తిన జనాలు
Tags:Water threat to Mattapally temple