తగ్గిన బీపీటీ పత్తి… రైతుల్లో ఆనందం

Reduced bottle cotton ... happiness in farmers

Date:16/04/2019

అదిలాబాద్ ముచ్చట్లు :
అదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట పత్తి. కొన్నేళ్లుగా రైతులు పత్తి సాగు చేస్తున్నారు. పత్తి సాగు చేసే రైతులు ఎకరానికి 1-2 రెండు ప్యాకెట్లు వినియోగిస్తారు.. జిల్లా సాగు విస్తీర్ణం మేరకు ఏటా 12-15 లక్షల పత్తి ప్యాకెట్ల అమ్మకం అవుతాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పొట్లంపై రూ.10 తగ్గనుంది. ఈ లెక్కన జిల్లా రైతులకు రూ.1.50 కోట్లు ఆదా అయ్యే అవకాశముంది. అయితే పత్తి విత్తనాల్లో వందల కంపెనీలు అనేక పేర్లతో విత్తనాలను మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నాయి. ఒక్కోసారి డిమాండ్‌ లేని విత్తనాలను గరిష్ఠ చిల్లర ధర కంటే తక్కువకే అమ్మేస్తున్నారు. డిమాండ్‌ ఉంటే వాటిని కొరతగా చూపి ఎక్కువ ధరతో అమ్ముతున్నారు.  ధరలపై,  నకిలీలపై నియంత్రణ లేకపోవడంతో విత్తనాల విషయంలో ఏటా రైతులు నష్టపోతున్నారు. కొన్నేళ్లుగా జిల్లాలో పత్తి సాగు తగ్గుతోంది. అయితే పత్తిని తగ్గించి ఇతర పంటలు సాగు చేసిన రైతులు పెద్దగా ప్రయోజనం చేకూరకపోవడంతో ఈ ఏడాది తిరిగి రైతులు పత్తి సాగు వైపు మొగ్గుచూపే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.జిల్లా సాగు విస్తీర్ణంలో 80 శాతం వర్షాధారంగా వేస్తున్నారు. బీటీ విత్తనాల రాకతో పురుగుల మందుల భారం తగ్గింది. దీంతో ఏటా పత్తి సాగు పెరుగుతోంది. అయితే పత్తి సాగు చేసే రైతులకు పెట్టుబడికి తగ్గట్టుగా గిట్టుబాటు ధర లభించకపోవడంతో నష్టపోతున్నారు. అయినా పత్తి సాగును వీడటం లేదు.
దీనికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో సాగుకు అనువైన పంటలు, విత్తన రకాలను అధికారులు సూచిస్తున్నారు. కానీ పత్తి పంట సాగు చేయడం తప్ప వేరే పంట సాగు గురించి అంతగా తెలియదు. నీటి సౌకర్యం లేకపోవడం, పండించిన పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో పత్తి వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో కురిసే వర్షాలు, కొంత మేరకు పత్తికి అనుకూలంగా ఉండటంతో పంటను సాగు చేస్తున్నారు. పత్తి పంటలో వస్తున్న నష్టాలతో మూడేళ్లుగా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించిన అది తక్కువే. పత్తికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం రెండేళ్లుగా సోయా, కంది సాగు పెంచేందుకు పలు పథకాల ద్వారా రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో సాగు తగ్గడం లేదు. విత్తనం మొదలుకొని సాగు, మార్కెటింగ్‌, బేళ్లు తదితర వాటికి సంబంధించిన వ్యాపారం జిల్లాలో విస్తరించింది. పత్తి క్రయవిక్రయాలతో పాటు దళారుల నుంచి తేలిగ్గా పత్తికి రుణం అందుతుండటంతో తప్పనిసరిగా రైతులు పత్తి సాగు చేస్తారు. పత్తి పంటపైనే ఏటా రూ. 2 వేల కోట్ల మేరకు లావాదేవీలు జరిగే వీలుంది. ఏటా 15 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు జిల్లాలో అమ్ముడుపోతాయి. 50-60 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకం అవుతుంది. 12-15 లక్షల బేళ్ల ఉత్పత్తి జరుగుతుంది. పత్తి విత్తనాల ధర తగ్గడంతో సాగు విస్తీర్ణం కొంత పెరిగే అవకాశముంది. ఒక్కో ప్యాకెట్ పై  రూ. 10 ఆదా అవుతుంది.
Tags:Reduced bottle cotton … happiness in farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *