హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా జిల్లాకు నీరు

Water to the district by Ejjala Stravanthi, Hendrinivewa

Water to the district by Ejjala Stravanthi, Hendrinivewa

-రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి యన్.అమరనాథ్ రెడ్డి

Date:24/11/2018

పలమనేరు ముచ్చట్లు:

డిసెంబరు చివరి నాటికి జిల్లాకు హంద్రీనీవా ,సుజల స్రవంతి ద్వారా నీరు తీసుకురావడం జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి యన్.అమరనాథ్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం పలమనేరు నియోజకవర్గం, పలమనేరు మండలం,కుర్మాయి పంచాయతీ పరిధిలోని జల్లిపేట, ముడివారిపల్లి,కుర్మాయి గ్రామం నందు నిర్వహించిన గ్రామదర్శిని – గ్రామ వికాసం కార్యక్రమంలో మంత్రి ప్రాల్గొన్నారు.  గ్రామస్థులతో ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకొని గ్రామస్థుల నుంచి  అర్జీలను స్వకరించారు. అనంతరం కుర్మాయి గ్రామం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం నాల్గు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా వివరాలను తెలుసుకొని,  అర్హులు ఉంటే వారి నుంచి అర్జీలను తీసుకొని సమస్యలు పరిష్కారం చేయటం, సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళిక ను రూపొందిచుకొనుటకు గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమము ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కీర్తిశేషులు నందమూరి తారకరామారావు  ప్రారంభించిన హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా జిల్లాకు రైతులకు వ్యవసాయానికి డిసెంబరు నెల ఆఖరుకు నీళ్ళు వస్తాయని తెలిపారు. మహిళల కోసం దీపం పథకం ద్వారా అందరికి గ్యాస్ కనెక్షన్లు అందజేసామని తెలిపారు. మహిళల ఆత్మ గౌరవం కోసం అందరికి మరుగుదొడ్లు ను నిర్మించడం జరిగిందని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కన్న ఎక్కువ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆములుచేస్తున్నాముని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు ఆర్హత ఉంటే చాలు వారు ఏ కులాలం, ఏ పార్టీని చూడకుండా పెన్సన్, రేషన్ కార్డు అందజేయడం జరుగుతుందని అన్నారు. గతం లో వృద్ధులు, వికాలాగులకు ఇస్తున్న పెన్షన్లు రూ.2 వందలు నుంచి, వెయ్యి, రూ.5 వందలు ఉన్న పెంచన్లు రూ.15 వందలు పెంచి ప్రతి నెల 1 వ తెదే నేరుగా వారి ఇండ్లు కు వెళ్లి వారి వేళ్ళు గుర్తులు వేసిన తరువాత పారదర్శకంగా పెంచన్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. 4 కేజీలు ఇస్తున్న బియ్యం ను 5 కేజీలు ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు రైతులకు, మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట ప్రకారంగా పసుపు కుంకం పథకం ద్వారా మహిళలకు రూ.10 వేలు వారి బ్యాంక్ ఖాతాలకు జమచేయడం జరిగిందని, రైతులకు రూ.50 వరకు ఉన్న రుణాలను ఒక్కసారిగా, రూ.1.50 లక్షలు ఉన్న రైతులకు ఇప్పటివరకు మూడు దశలు గా రైతుల బ్యాంక్ ఖాతాలకు జమావహేయడం జరిగింది.

ని, మిగిలిన విడతల కూడా డిసెంబరు, జనవరిలో రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతు లకు ఇన్ పుట్ సబ్సిడీ ని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు వేయడం జరిగిందని తెలిపారు. రైతులకు సూక్ష్మ పోషక ఎరువుల ను రాయితీ పై అందజేయడం, యస్.సి,యస్.టి రైతులకు డ్రిప్ పరికరాలను వంద శాతం ఉచితంగా అందిస్తున్నమని తెలిపారు. గ్రామాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, గ్రామాలకు లింక్ రోడ్లు వేయడం,అన్ని గ్రామాలలో సిసిరోడ్లు, యల్.ఇ. డి బలుపులు వేయడం,ప్రతి ఇంటింటి నుండి చెత్తను సేకరించడం తడి పొడి చెత్తను వేరుసేసి దాని నుండి ఎరువులు తయారుచేసి రైతులకు అమ్మి దాని ద్వారా వచ్చిన ఆదాయమును ఆగ్రామ పంచాయతీ అభివృద్ధికి ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు.అన్ని గ్రామాలలో అంగన్ వాడి భవనాలు నిర్మాణాలు చేస్తున్నామని అన్నారు.నిరు పేదలకు కొరకు చంద్రన్న బీమా,చంద్రన్న పెండ్లి కానుక ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గానికి 2 వేలు గృహాల మంజూరు ఆయాని గృహాలు లేని నిరుపేదలకు అర్హులు ను గుర్తించి వారికి గృహాలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర విభజన జరిగి రూ 16 వేల కోట్ల లోటు బడ్జెట్ వున్నాను రాష్టాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారంటే అనుభవం కలిగిన ఒక సంవర్ధమైన నాయకుడు గనుక ఇన్ని కార్యక్రమాలను ఆములుచేస్తున్నారని, ఈ నాయకుని ఇంకా పది కాలంపాటు ఉంటే మన బిడ్డల భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులకు అందరికి ప్రభుత్వం పథకాలను అందజేయడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎన్నడూ జరగని అభివృధ్ధి ఈ నాలుగేళ్ళలో జరగడం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతోందన్నారు. అన్ని గ్రామాలకు సిసి రోడ్లు,గ్రామాలకు గ్రామాలకు రోడ్లు అనుసందానం,యల్ ఇ డి బల్బులు,త్రాగునీరు సరఫరా, ఇంటింటి నుండి చెత్త సేకరణ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరించారు.

రైతుల సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు .ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయమ కొరకు రాయితీ పై వ్యవసాయ యంత్రలను,రైతు రథం పథకం ద్వారా ట్రాక్టర్లను అందజేయడం తోపాటుగా డ్రిప్ పరికరాలను యస్ సి,యస్ టి ల రైతులకు వంద శాతం ఉచితంగాను 5 ఎకరాల లోపు మిగిలిన రైతులకు 90 శాతం రాయితీ తో డ్రిప్ పరికరాల ను అందిస్తున్నాముని తెలిపారు. ఇటీవల కావలసిన రైతులకు ఉచితంగా ఉలవలను పంపిణీ చేశామని, గ్రామీణ ప్రాంతాల్లో అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగి కుటుంబంలో వ్యక్తి చనిపోతే వారికోసం చంద్రన్న బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు అందజేయడం జరుగుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారి గృహాల లో వివాహం చేసుకొనుటకు చాలా ఇబ్బందులు వుంటాయని వారికోసం చంద్రన్న పెండ్లి కానుక ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బి సి లకు రూ.35 వేలు,యస్ సి లకు రూ. 40 వేలు,యస్ టి లకు రూ. 50 వేలు,మైనార్టీల కు దుల్హన్ పథకం ద్వారా రూ.50 వేలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

అక్టోబర్ గాంధీ జయంతి నుంచి ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా డిగ్రీ వరకు చదువు కొని నిరువుద్యోగిలు గా ఉన్న 22 సం .35 సం లో పు ఉన్న 3 లక్షల మంది యువతకు నెలకు రూ.వెయ్యి రూపాయల తో పాటుగా వారి ఉపాధి కల్పించుటకు వృత్తి నైపుణ్యం కలిగించి పరిశ్రమల ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కలిగించడం జరుగుతుందని తెలిపారు. ఎవ్వరు లేని వంటరి మహిళలకు పెంచన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. అర్హులైన పేదలకు అందరికి ఇళ్ళు,పెంచన్లు, రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఇంకా పది కాలాలపాటు ఉంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొనుటకు అవకాశాలు వుంటాయని తెలిపారు. గర్భం దాల్చిన నుంచి అన్ని రకాల టీకాలు వేయించి, ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించి తల్లిబిడ్డ ఎస్ప్రెస్స్ ద్వారా వారిని ఇంటి దగ్గర దింపి బిడ్డకు యన్.టి.ఆర్, బసవతారక క్వాటీలను అందచేయడం జరుగుతుందని తెలిపారు. అంగన్ వాడి కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భవతులు, బాలింతలకు బాల సంజీవని పౌష్టికాహారం అందజేస్తున్నామని తెలిపారు.

9 వతరగతి చదివే బాలికలు మధ్యలో చదువు ఆపకుండా చదువు కొనుటకు సైకిలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. జిల్లాల.మైనార్టీల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, మసీదులో ప్రార్థనలు చేసే ఇమామలు మౌజులకు జీతం ఇస్తుందని, విదేశీలకు వెళ్లి చదువు కొనే పేద విద్యార్థులకు యన్ టి ఆర్ విద్యా పథకం ద్వారా విదేశాలకు వెళ్లి చదువుకోవడం కోసం రూ.10 లక్షలు అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  

ప్రధాని మోదీ ఓడిపోతానని భయపడుతున్నారు

Tags:Water to the district by Ejjala Stravanthi, Hendrinivewa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *