Water to the Punganur Summer Storrez soon

పుంగనూరు సమ్మర్‌స్టోరేజ్‌కు త్వరలో నీరు

– మంత్రి పెద్దిరెడ్డి

Date:19/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

సుమారు పది సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోని సమ్మర్‌స్టోర్‌జ్‌ ట్యాంకుకు నెల రోజులలోపు నీరు విడుదల చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఆయన పట్టణంలోని పుంగమ్మ చెరువులో నిర్మించిన సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకును చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ,నెల్లూరు పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఈ మోహన్‌, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, కమిషనర్‌ కెఎల్‌.వర్మ తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు హంద్రీనీవా నీటిని విడుదల చేస్తామన్నారు. పట్టణ ప్రజలకు శాశ్వత దాహార్తి తీర్చేందుకోసం సుమారు పది సంవత్సరాల క్రితం నిర్మించిన సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు నెల రోజులలోపు నీటిని విడుదల చేస్తామన్నారు. ఇందుకోసం అవసరమైన మోటార్లు కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే సమ్మర్‌స్టోరేజ్‌ట్యాంకులో ఉన్న ముళ్ళ చెట్లను జెసిబిలతో తొలగించాలని కమిషనర్‌ వర్మను ఆదేశించారు. అలాగే కట్టపై భాగంలో నాలుగు వైపుల చెట్లను తొలగించి, తారు రోడ్డు వేయాలని ఆదేశించారు. తక్షణమే పనులు చేపట్టాలన్నారు. ఇందు కోసం అవసరమైన మోటార్లను తక్షణం పంపించాలని డీలర్లతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, పెద్దిరెడ్డి, అక్కిసాని బాస్కర్‌రెడ్డి, ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్‌ విశ్వనాథ్‌, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర , కౌన్సిలర్లు అమ్ము, రేష్మా, మంజుల, నయాజ్‌, రెడ్డిశేఖర్‌ , మాజీ కోఆఫ్షన్‌ మెంబర్‌ ఎంఎస్‌.సలీం తదితరులు పాల్గొన్నారు.

26 వరకు న్యాయవాదులు విదులు బహిష్కరణ

Tags: Water to the Punganur Summer Storrez soon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *