కరువునేలపై జలధారలు -జలయజ్ఞ భగీరథతుడు జగన్
పుంగనూరు ముచ్చట్లు:
కరువుకాటకాలతో సతమతమౌతున్న పడమటి నియోజకవర్గమైన పుంగనూరులో వందల సంవత్సరాల నుంచి నీరు లేక అలమటించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించిన జలయజ్ఞాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టంగా పనులు చేయించడంతో కరువునేలపై జలధారలు ప్రారంభమైంది. నియోజకవర్గానికి సాగునీరు-తాగునీరు కొరత తీరిపోనున్నది. ఇందు కోసం రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గానికి వైఎస్సార్ జిల్లా గండికోట ప్రాజెక్టు నుంచి పైపులైన్లు ద్వారా నీటిని సరఫరా చేసే కార్యక్రమానికి రూ.5 వేల కోట్లు కేటాయించారు. పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే పుంగనూరు మండలం నేతిగుట్లపల్లెలో ఒకటిఎంసీ నీటి నిల్వ ప్రాజెక్టు , సోమల మండలం ఆవులపల్లె వద్ద ప్రాజెక్టు పనులు సుమారు రూ.1200 కోట్లతో నిర్మిస్తున్నారు. అలాగే సదుం మండలం గంటావారిపల్లె వద్ద రూ.9 కోట్లతో , కంభంవారిపల్లె వద్ద రూ.36 కోట్లతో , ఊటుపల్లె వద్ద రూ.12 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. గత దివంగత రాజన్న పాలనలో పుంగనూరులో రూ.33.33 కోట్లతో సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు నిర్మించి, హంద్రీనీనా నీటికి అనుసంధానం చేశారు. అలాగే సదుం మండలం కొర్లకుంట వారి ప్రాజెక్టును రూ.24 కోట్లతో నిర్మించారు. పాపిరెడ్డిగారిపల్లె వద్ద రూ.12 కోట్లతో ప్రాజెక్టులు నిర్మించారు. ప్రస్తుతం నేతిగుట్లపల్లె, ఆవులపల్లె ప్రాజెక్టు పనులు కోర్టులో బాబు అండ్‌కో కేసులు వేయడంతో పనులు ఆపివేశారు.

జలయజ్ఞంతోనే మా అభివృద్ధి…
పడమటి నియోజకవర్గమైన పుంగనూరులో జమీందారుల కాలంలో నిర్మించిన చెరువులు, కుంటలు మాత్రమే ఉన్నాయి. నీరు లేక ఒక పంట కూడ పండించలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా గ్రామంలో జలయజ్ఞం క్రింద సుమారు రూ.300 కోట్లతో రిజర్వాయర్ నిర్మించారు. దీని ద్వారా సుమారు ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఒక పంట కాదు మూడు పంటలు చేసే భరోస మాకు లభించింది. ఎన్నడు లేని విధంగా కరువుకే పరిమితమైన పుంగనూరు మండలంలో రిజర్వాయర్ నిర్మించడం మా నియోజకవర్గ కరువు తీరింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి రుణపడి ఉన్నాం.
– రామకృష్ణారెడ్డి, రైతు, చిలకావారిపల్లి.
Tags:Watercourses on drought – Jagan, the water lord Bhagiratha
