Natyam ad

ప్రాజెక్టులకు జలకళ

అనంతపురం ముచ్చట్లు:


భారీగా కురుస్తున్న వర్షా లతో ప్రాజెక్టులన్నీ నీటి కుండల్లా దర్శనమిస్తున్నాయి.ఎగువ ప్రాజెక్టుల కు నీటి మట్టం పెరగడంతో దిగువ ప్రాజెక్టు నీటి ప్రవాహాం పెరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా రోజురోజుకూ అనంతపురం జిల్లా భైరవానితిప్ప ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు పైభాగాన ఉన్న వాణి విలాస్ సాగర్ జలాశయం నిండుకుండలా ఉంది. దాని నీటి నిల్వ సామర్థ్యం 135 అడుగులు కాగా.. 133కు చేరడంతో మరువ పారుతోంది.దీంతో జలాశయం నుంచి కిందకు నీటిని వదిలారు. ఫలితంగా ఒక్కసారిగా బీటీపీలోకి 60వేల క్యూసెక్కుల వరద చేరింది. బీటీపి ప్రాజెక్టుకు దిగువన వున్న లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా వుండాలని తెలియజేసిన మంత్రి ఉషాశ్రీచరణ్ సూచించారు.

 

Tags: Waterworks for projects

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.