చాప కింద నీరులా స్వైన్ ఫ్లూ

Date:04/12/2020

ఖమ్మం ముచ్చట్లు:

చలికాలం సమీపించడంతో జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే చలి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే మేలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో స్వైన్‌ఫ్లూ బారిన పడి మరణించిన సంఘటనలు లేనప్పటికీ చలికాలంలో వ్యాధి వ్యాప్తి చెందే అవకావం లేకపోలేదు. చలితీవ్రత లేని రోజుల్లో  జిల్లాలో 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, శాలిగౌరారం, మర్రిగూడ మండలాల్లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ కేసులను నమోదైన సంఘటనలు ఉన్నాయి. వారికి హైదరాబాద్‌లోని గాంధీ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొంది వ్యాధి నుంచి విముక్తులయ్యారు.చలికాలంలో గాలి ద్వారా ఒకరి నుంచి మరోకరికి ఇన్‌ఫ్లూయంజా ఏ వైరస్‌ వ్యాప్తి చెందుతుండడం, ఊపిరితిత్తుల అంతర భాగాలకు వ్యాధి సోకడం వల్ల ప్రమాదకారిగా మారి ప్రాణాపాయం సంబవించే అవకాశం ఉంటుం ది. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఎవరైనా కనపడితే వెంటనే వారి రక్తనమూనాలను సేకరించి హైదరాదాద్‌లోని ఐపీఎం (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రీవెంటీవ్‌ మెడిషిన్‌) ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పది పడకలతో ప్రత్యేక స్ల్వైన్‌ఫ్లూ వార్డును ఏర్పాటు చేశారు.

 

 

స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ అని ఐపీఎం నివేదికలో తేలితే వెంటనే వారికి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స అందించడానికి అవసరమైన మందులను కూడా అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగశాఖ అధికారులు పేర్కొంటుననారు. ప్రజలు వ్యాధిపై అవగాహనను పెంపొందించుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. దగ్గు, ముక్కుకారడం, ఆయాసం, దమ్మురావడం, ఊపిరిపీల్చడానికి కష్టపడడం, పిల్లికూతులు రావడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, గొంతులో గరగర, జ్వరం రావడం, వం టి నొప్పులు, కళ్ల నుంచి నీరుకారడం, చెవి నొ ప్పి, చెవి నుంచి చీము కారడం, చిన్న పిల్లలకు నిమ్ముచేయడం వంటి లక్షణాలు కనపడతాయి.బహిరంగ ప్రదేశాలు, ఏటీఎంలు, తలుపుల గొళ్లాలు, మొదలైన వాటిని వాడిన తరువాత, ప్రయాణాలను చేసిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కునే వరకు  ముక్కు, కళ్లు, నోటిని ముట్టుకోవద్దు. చేతులను తరుచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

 

 

తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి, ముక్కకు చేతి రుమాలును అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. చలికాలంలో మంచుపడుతున్న సమయంలో బయటకు రాకూడదు. ఉన్నిదుస్తులను ధరించాలి, వేడివేడి ఆహరం, గోరువెచ్చని నీ టిని తాగడం మంచిది. చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉన్ని దుస్తులను వేయాలని, లక్షణాలు కనపడిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేం«ద్రంలోని డాక్టర్‌ను సంప్రదించాలి.

 రాజులకు కలిసి రాని కాలం..

Tags: Watery swine flu under the mat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *