Date:26/09/2020
సూర్యాపేట ముచ్చట్లు:
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి అన్ని కాలనీలు జలమయం అయ్యాయి. భారీ వర్షనికి చౌదరి చెరువు పొంగిపొర్లుతుంది. దీంతో ప్రధాన రాహదారిపై నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నడిగూడెం మండలంలో 18 సెంటిమిటర్ల వర్షం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి పలు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో టీవీలు, ఫ్యాన్లు, మంచాలు నిత్యావసర వస్తువులు, సరకులు పూర్తిగా నీటమునిగాయి. రాత్రి నుంచి నీటిని ఎత్తిపొయ్యలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరికొందరు స్థానికంగా ఉన్న ఎస్సి కమ్యూనిటీ హాల్ లో తలదాచుకున్నారు.. వేణుగోపాలపురం, బృందావనపురం గ్రామాలాల్లో పత్తి పంట నీట మునిగింది.
కరోనాతో కోలుకోలేని టూరిస్ట్ సర్వీసులు
Tags:Watery walk