పౌరసత్వంపై జగన్‌మాటలకు కట్టుబడి ఉంటాం

hief Minister YS Jagan Mohan Reddy on the Citizenship B

hief Minister YS Jagan Mohan Reddy on the Citizenship B

– రాష్ట్రంలో అమలు చేయం.
– ముస్లింలకు అండగా ఉంటాం.
-మంత్రి పెద్దిరెడ్డి స్పష్టీకరణ

Date:04/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వం బిల్లుపై ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి కడప బహిరంగ సభలో ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉంటామని, రాష్ట్రంలో పౌరసత్వబిల్లును అమలు చేసే ప్రసక్తే లేదని, ముస్లింలకు అండగా ఉంటామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పుంగనూరు పట్టణంలో అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు షా , కార్యదర్శి అమ్ము, ముస్లిం మైనార్టీల నాయకులు ఫకృద్ధిన్‌షరీఫ్‌, ఎంఎస్‌.సలీంబాషా, నూరుల్లా, అఫ్సర్‌, అజీజ్‌సాహెబ్‌, కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌అలిఅహమ్మద్‌, కిజర్‌ఖాన్‌ ఆధ్వర్యంలో ముస్లిం నేతలతో మంత్రి సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలందరు ముక్తకంఠంతో పౌరసత్వబిల్లును వ్యతిరేకిస్తున్నామని, ఈ బిల్లును రద్దు చేసేంత వరకు పోరాటాలు చేయదలచామని , ఈపోరాటాలకు మద్దతు ఇవ్వాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు పార్టీ నాయకులు , ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉంటామన్నారు. మత తత్వానికి సంబంధించిన బిల్లుతో నష్టం చేకూర్చుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లుకు తాము వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని, ముస్లింలు ఈ విషయంలో ఆందోళన చెందవద్దని వైఎస్సార్సీపి ముస్లింలకు అండగా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నేతలు అస్లాంమురాధి, అఫ్సర్‌, చాంద్‌బాషా, రసూల్‌ తదితరులు పాల్గొన్నారు.

రంగంలోకి సీకే బాబు భార్య లావణ్య

Tags: We adhere to the pics of citizenship

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *