Natyam ad

మేమంతా సిద్ధం బస్సు యాత్ర

కర్నూలు ముచ్చట్లు:

మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం (మార్చి 29) కర్నూలు జిల్లా పెంచికలపాడు లోని రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది.ఈ యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 9 గంటలకు పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకుంటారు. రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకుంటారు.అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో సాయంత్రం 3 గంటలకు పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం,బెణిగేరి,ఆస్పరి, చిన్నహుల్తి,పత్తికొండ బైపాస్ మీదుగా KGN ఫంక్షన్ హాల్ కి దగ్గరలో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

 

Post Midle

Tags:We are all ready for the bus trip

Post Midle