Natyam ad

పుంగనూరులో అభివృద్ధి చే సి ఓట్లు అడుగుతున్నాం

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నామని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిరోడ్డు, ఎల్‌ఐసీ కాలనీ, కొత్తపేట, కొత్తయిండ్లు కాలనీలలో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అలాగే మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ లలిత, రెడ్డిజన సంక్షేమ సంఘ నాయకుడు మధుసూదన్‌రెడ్డి కలసి మేలుపట్లలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అలాగే ఎన్‌.ఎస్‌.పేటలో కౌన్సిలర్లు నూర్జహాన్‌, రాఘవేంద్ర, మైనార్టీల నాయకుడు సలామత్‌ కలసి ప్రచారం నిర్వహించారు. చంద్రకాంతవీధిలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము ప్రచారం చేశారు. వీరితో పాటు కౌన్సిలర్లు అర్షద్‌అలి, కిజర్‌ఖాన్‌, ఆదిలక్ష్మీ, జెపి.యాదవ్‌, రెడ్డెమ్మ, రేష్మా వారి వారి వార్డులలో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లకు రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారాలలో ఓటర్లను కోరారు.

Post Midle

Tags: We are asking for C votes for development in Punganur

Post Midle