Natyam ad

హామీలు అమలు చేసి ఓట్లు అడుగుతున్నాం

– మూడవరోజు మోటారు సైకిల్‌ ర్యాలీ

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేసి ధైర్యంగా ఓట్లు అడిగేందుకు వెళ్తున్నామని పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ తెలిపారు. సోమవారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి మూడవ రోజు మోటారుసైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. వాహనాలకు పార్టీ జెండాలు కట్టారు. ప్రజాప్రతినిధులు, నాయకులు కండువాలు, టోపిలు ధరించి వైఎస్సార్‌సీపీ జిందాబాద్‌…జగనన్న జిందాబాద్‌…పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలు చేయడం పలువురిని ఆకట్టుకుంది. ర్యాలీ బోడేవారిపల్లి, ఈడిగపల్లి, చండ్రమాకులపల్లి, నల్లగుట్లపల్లి, పాళ్యెంపల్లి, జెడితాండ, ఊటూరు గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామ కూడలీలోను ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి ఐదేళ్ల కాలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పుంగనూరు అసెంబ్లి అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి కి రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రెండవ సారి  రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, రామకృష్ణారెడ్డి, జయనారాయణరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Tags; We are asking for votes by implementing the promises

Post Midle