అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం -రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ నాగభూషణం

పుంగనూరు ముచ్చట్లు:

నలబై సంవత్సరాలుగా జరగని అభివృద్ధిని నాలుగన్నరేళ్లలో చేసి, ఓట్లు అడుతున్నామని దీనిని ప్రజలందరు గుర్తించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి రెండవ సారి అధికారం ఇవ్వాలని రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం అన్నారు. మంగళవారం చంద్రమౌళి మార్కెట్‌లో సచివాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింహప్రసాద్‌తో కలసి డిజిటల్‌ బోర్డును ఆవిష్కరించారు. అలాగే పట్టణ కూడలీలో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మా నమ్మకం నువ్వే జగన్‌ అనే కరపత్రాలను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ పుంగనూరు సమీపంలో 1536 మందికి టిట్కో గృహాలు కేటాయించామన్నారు. అలాగే అర్హులైన పేదలను గుర్తించి, సుమారు 4వేల మందికి ఇండ్ల పట్టాలు మంజూరు చేసి, జగనన్న కాలనీలను పట్టణాలుగా అభివృద్ధి చేసిన ఘనత రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దక్కిందన్నారు. అలాగే బైపాస్‌రోడ్డు, పట్టణంలో మిని బైపాస్‌ రోడ్డు, ఎంబిటి రోడ్డు విస్తరణ, కౌండిన్య నది కాలువల్లో సిమెంటు కాలువల నిర్మాణంతో పాటు పట్టణ ప్రజలు ఆహ్లదంగా ఉండేందుకు పుంగమ్మ చెరువు కట్టపై పార్కు నిర్మాణం చేపట్టామన్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో పుంగనూరును అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అలాగే పార్టీలకతీతంగా పేదరీకమే ప్రామానికంగా తీసుకుని ప్రతి ఒక్కరికి నవరత్నాల పథకాలను అందించి , వ్యక్తి గతంగా అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనన్నారు. మాయమాటలతో ఓట్ల కోసం వచ్చే గత పాలకులకు భిన్నంగా పనులు చేసి ఓట్లు అడగడంతో వైఎస్సార్‌సీపీ దేశంలోనే చరిత్ర సృష్టించిందన్నారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని , ప్రతి ఒక్కరు ఆయనను ఆశీర్వధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, పార్టీ పట్టణ అధ్యక్షుడు జయరాం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, లలిత తో పాటు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags: We are asking for votes for development – State Folk Art Society Chairman Naga Bhushanam

Post Midle