నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నాం

హెరిటేజ్ సిటీగా మార్పు చేయడమే లక్ష్యం
మరో పది రోజుల్లో పనులన్నీ పూర్తి
దేవీచౌక్, పుష్కర ఘాట్ల పరిశీలనలో ఎంపీ భరత్ రామ్ వెల్లడి
రాజమహేంద్రవరం  ముచ్చట్లు:
చారిత్రక రాజమహేంద్రవరం నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామని, తద్వారా నగరం హెరిటేజ్ సిటీగా మార్పు చెందనుందని రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్విప్ మార్గాని భరత్ రామ్ తెలిపారు.  పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన గురువారం రాజమహేంద్రవరం నగరానికి వచ్చారు.  మధురపూడి విమానాశ్రయం నుంచి నేరుగా వచ్చిన ఆయన నగరంలోని దేవీచౌక్, పుష్కర ఘాట్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా దేవీచౌక్, పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్తోపాటు, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతోపాటు, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో పనుల ప్రగతిపై సమీక్షించారు.  గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి కావాల్సిన పనులకు సంబంధించిన అంశంపై కాంట్రాక్టర్ను నిలదీశారు. ఎప్పటిలోగా పూర్తి చేస్తారని కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. జరుగుతున్న పనులపై అధికార యంత్రాంగం సైతం ప్రత్యేక దృష్టి సారించాలని నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు.  ఈ సందర్భంగా దేవీచౌక్ వద్ద పనులను వచ్చే నెల పదో తేదీ నాటికి పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ ఆయనకు వివరించారు.
అలాగే పుష్కర ఘాట్ వద్ద పనులను నెల రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ చారిత్రక రాజమహేంద్రవరం నగరాన్ని గ్రేటర్ నగరంగా తీర్చిదిద్దాలన్నా లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చుట్టుపక్కల గ్రామాలను సైతం నగరంలో విలీనం చేయడం జరిగిందని వివరించారు. అయితే కోర్టు కేసులు, కరోనా విపత్కర పరిస్థితుల వల్ల కొంత ఆలస్యం కావడం జరిగిందన్నారు. అయినా నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
రాజమహేంద్రవరం నగరాన్ని హెరిటేజ్ సిటీగా మార్పు చేయాలన్నా సంకల్పంతో అడుగులు వేస్తున్నామని, అలాగే జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తున్న స్మార్ట్ సిటీగా గుర్తింపు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అందులోభాగంగానే చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేయడం జరిగిందని వివరించారు.  స్మార్ట్ సిటీగా ఎంపిక అయితే వందల కోట్ల రూపాయలు నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.  వందల సంవత్సరాల చరిత్ర గల్గిన నగరంలోని దేవీచౌక్ సెంటర్ను ఐకానిక్ ప్లేస్గా రూపొందించే రీతిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.  ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులను మరో పది రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.  అలాగే భారతదేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందేలా పుష్కర ఘాట్ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. పుష్కర ఘాట్ వద్ద ఉన్న రెండు రైల్వే వంతెనల మధ్య ఉన్న గోదావరి అందాల మధ్య చాలుక్య ఫెస్టువల్ను నిర్వహించాలనే ఆలోచనతో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

 

Tags:We are developing the city rapidly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *