మునుగోడు హమీలను నెరవేస్తున్నాం-మంత్రి హరీష్ రావు
హైదరాబాద్ ముచ్చట్లు:
మునుగోడు ఉప.ఎన్నికల్లో ప్రజలకు ఇచిన హామీ ప్రకారం, సీఎం కేసీఆర్ సూచనలకు మేరకు అభివృద్ది పనులు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. చౌటుప్పల్ 36 కోట్ల రూపాయల నిధులతో 100 పడకల ఆసుపత్రిని శంకుస్థాపన, మర్రిగుడ లో 30 పడకల ఆసుపత్రిని మంజూరు, నల్లగొండ, సూర్యాపేట లలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఎర్పాటు చేసాం. కేంద్ర ప్రభుత్వం ఏయిమ్స్ s ప్రారంభించినా అక్కడ వసతులు లేవు. కేవలం ఓపి సేవలే వునాయి. ఐపి సేవలు లేవు. కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర అభివృధిపై చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. వైద్య రంగంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1300 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యాన్ని కెసిఆర్ ప్రభుత్వం నివారిస్తుంది. రాష్ట్రం రాక ముందు మూడు డయాలసిస్ సెంటర్లు వుంటే.. ఇప్పుడు 100 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. డయాలసిస్ సేవలతోపాటు.. ఉచిత బస్ పాస్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చాం. -తంగేడిపల్లి పీహెచ్సి కి 90 లక్షలు మంజూరు చేశాము.
కాంగ్రెస్, బిజెపి హయాంలో 20 ఏళ్లలో ఒక మెడికల్ కాలేజ్ వస్తె.. ఇప్పుడు ఒక యేడాదిలో ఎనిమిది మెడికల్ కాలేజ్ లకు పెంచుకున్నమని అన్నారు. నిరుపేదలకు వైద్యం వారి వద్దకే వెళ్ళాలని నినాదంతో.. పల్లె దవాఖానలు ఏర్పాటు చేసాం. కేసిఆర్ కిట్ ద్వారా.. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే ప్రసవాలు 30 శాతం నుంచి 68 శాతంకి పెరిగాయి. కెసిఆర్ కిట్ తోపాటు.. కెసిఆర్ న్యూట్రిషన్ పథకం కూడా అందించాలని నిర్ణయిoచుకున్నరు. గతంలో ఎంబీబీఎస్ చదవాలంటే ఉక్రెయిన్, ఫిలిఫెన్స్ వెళ్ళేవారు. ఇప్పుడు 35మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్దులు బయటికి వెళ్లకుండా స్వరాష్ట్రంలో ఎంబీబీఎస్ చేస్తున్నారు. చౌటుప్పల్ హైవేపై.. 100 పడకల ఆసుపత్రితోపాటు క్రిటికల్ సేవలు అందుబాటులో తెస్తామని అన్నారు.

Tags; We are fulfilling the previous promises – Minister Harish Rao
