-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Date:23/01/2021
మెదక్ ముచ్చట్లు:
మెదక్ జిల్లా తునికి లోని కృషి విజ్ఞాన కేంద్రం లో నూతన పరిపాలన భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. తరువాత సేంద్రియ పంటల విధానాన్ని అయన పరిశీలించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ కార్యనిర్వాహకుడు భయ్యాజి జోషి, ఐసిఎఆర్ అధికారులు పాల్గోన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం ఉండడం వల్ల ఇక్కడ ప్రాంత రైతులకు మేలు జరుగుతుంది. గతంలో మన దేశంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యం చేయబడింది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తున్న ఇట్లాంటి కేవికే లు మనకు ఎంతో అవసరమని అన్నారు. మన దగ్గర పండ్ల దుకాణాలలో విదేశాల్లో పండే పండ్లు అమ్ముతున్నారు మన దేశమే వ్యవసాయ ఆధారిత దేశం మనం ఇక్కడ మనకు కావలిసిన పండ్లు పండించుకోవాలి. వ్యవసాయం లాబాసాటిగా మారాలి ఆ దిశగా శాస్త్రవేత్తలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.. రైతులు అందిపుచ్చుకోవాలని అన్నారు.
నరేంద్రమోడీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది.. వ్యవసాయానికి సరిపడ విద్యుత్ నిలువలు పెంచింది.. పరిశ్రమలకు కుడా నిరంతరంగా కరెంట్ ఇస్తున్నాం. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెస్తున్నాం. మద్దతు ధర ఇస్తు వ్యవసాయం ద్వారా రెట్టింపు లాభాలు వచ్చేలా మోడి ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతులకు ఎక్కడ ధర ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకొనే అవకాశం కల్పిస్తుంది మోడి ప్రభుత్వమని అన్నారు.గతంలో ఎరువులు దొరకకపోయేవి ఎరువుల కొరత తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంది. మన రాష్ట్రములోని రామగుండంలో మూతపడిన ఎరువుల పరిశ్రమ ను కూడ తిరిగి ప్రారంబించబోతున్నారు మోడి. చిన్న ,సన్న కారు రైతులను సంఘటితం చేయబోతున్నాం.. పంటను ఇష్టం వచ్చిన చోట అమ్ముకునే లా కృషి చేస్తున్నామని అయన అన్నారు.
పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags: We are going to mobilize small, slender car farmers