సైనికుడి కుటుంబానికి అండగా వుంటాం

గుంటూరు ముచ్చట్లు:

 

భరత మాత పోరులో వీర మరణం పొందిన గుంటూరు జిల్లా కి చెందిన జస్వంత్ రెడ్డి భౌతికకాయా నికి హోంమంత్రి సుచరిత నివాళుల ర్పించారు. దేశ రక్షణ కోసం తన ప్రాణాలు ఇవ్వడం.. జస్వంత్ త్యాగం మరవలేనిదన్నారు. అతి చిన్న వయసులోనే వీర జవాన్ జస్వంత్ రెడ్డి మరణించటం బాధాకరమని, దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చి ఆ తల్లిదండ్రుల జన్మ చరితార్థమని కొనియాడారు సుచరిత. జస్వంత్ కుటుంబసభ్యులకు ప్రభుత్వ తరపున రూ. 50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. తమ్ముళ్ల కోసం జస్వంత్ నిరంతరం ఆలోచించే వాడని.. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జస్వంత్ కుటుంబానికి అండగా ఉంటామని హోంమంత్రి సుచరిత తెలిపారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: We are grateful to the soldier’s family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *