పొలకల్ లో మనబడి నాడు-నేడు

Date:14/11/2019

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పొలకల్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో  మనబడి నాడు-నేడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎమ్మెల్యే డా.సుధాకర్. పాల్గొన్న డీఈఓ సాయిరాం, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, సమగ్ర శిక్ష పిఓ విద్యాసాగర్ , పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఇమాం, స్థానిక ప్రజాప్రతినిధులు, హెడ్మాస్టర్ కిష్టన్న, టీచర్లు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గోన్నారు.
ఈ సందర్బంగా  విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో మొదటి దశలో 1143 ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు-నేడు…9 రకాల మౌళిక సదుపాయాల కల్పన జరుగుతుందని అన్నారు. దశలవారీగా అమలు జరిగే ఈ కార్యక్రమం మూడు సంవత్సరాలపాటు కొనసాగుతుంది. కార్యక్రమం అమలుకు ముందు.. అమలుకు తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన అభివృద్ధిని ఫోటోలతో సహా పోల్చి చూపడం ఈ కార్యక్రమ రూపకల్పన వెనుక ఉన్న సంకల్పమని అన్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్, బూట్లు అందజేయడం జరుగుతుంది. మనబడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, ప్రహరీ గోడలు, తరగతి గదులకు పెయింటింగ్, మరమ్మతులు, ఫినిషింగ్, బ్లాక్ బోర్డులు, విద్యార్థులకు రక్షిత త్రాగునీరు, ఇంగ్లీష్ ల్యాబ్ ల ఏర్పాటు లాంటి 9 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని  కలెక్టర్ అన్నారు. ఎమ్మెల్యే డా.సుధాకర్  మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్చివేసి, మెరుగైన మౌళిక సదుపాయాలను కల్పించేందుకు ముఖ్యమంత్రి  వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన విన్నూత్న కార్యక్రమం మనబడి నాడు-నేడు అని అన్నారు.

 

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం

 

Tags:We are in Polkal today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *