Natyam ad

పేదలకు భూ హక్కులు కల్పించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం

పుంగనూరు ముచ్చట్లు:

ఏరాష్ట్రంలోను లేని విధంగా పేద ప్రజలకు భూహక్కులు కల్పించి , పేదలను యజమానులుగా మార్చిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటామని దళిత సంఘాల నేతలు స్పష్టం చేశారు. శనివారం స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌లో దళిత నేతలు ఎం.శంకరప్ప, రాజు, కృష్ణప్ప ఆధ్వర్యంలో ధ్యాంకు సీఎం సార్‌ అంటు పూలతో కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సహకారంతో వేలాది మంది ఎస్సీ, ఎస్టీ , బీసీ , మైనార్టీలకు భూ హక్కులు లభించిందన్నారు. బడుగుబలహీన వర్గాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భూ వరం లభించిందని కొనియాడారు. అలాగే 50 ఏళ్లుగా సర్వేలకు నోచుకోక ఆక్రమణలకు గురైన ఎంతో మంది పేదల భూములు జగనన్న భూశాశ్వత హక్కు కార్యక్రమం ద్వారా దురాక్రమణలకు గురైన భూములు స్వాధీనమైందన్నారు. ఇంతటి మహత్‌ కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరు సైనికుల వలే పని చే యాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ అంజప్ప, దళిత నాయకులు సురేష్‌, కృష్ణప్ప, ఆనంద తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: We are indebted to CM Jagan who gave land rights to the poor

 

Post Midle