Natyam ad

  అభివృద్దిచేస్తున్న జగనన్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం

— రూ:24 కోట్లతోడబుల్‌ రోడ్డుపనులు మంజూరు

–సీఎం, మంత్రి, ఎంపీ,  ఎమ్మెల్యే ల  చిత్రపటాలకు పాలాభిషేకం

— మండలంలో అత్యధిక మెజార్టీ సాధిస్తామన్న ఏ.కొత్తకోట వాసులు

Post Midle

— మంత్రిపెద్దిరెడ్డి కుటుంభానికి రుణపడి ఉంటాం

 

చౌడేపల్లె ముచ్చట్లు:

ఊహించని రీతిలో అభివృధ్దిచేస్తున్న జగ న న్న ప్రభుత్వానికి  జీవితాంతం రుణపడి ఉంటామని చౌడేపల్లె మండలం, ఏకొత్తకోట గ్రామపంచాయతీ ప్రజలు ముక్తకంఠంగా ముఖ్య అ•తిగా హాజరైన  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, జెడ్పిటిసీ సభ్యులు ఎన్‌. దామోదరరాజు సమక్షంలో  ప్రకటించారు. శుక్రవారం  ఏ.కొత్తకోట బస్టాండ్‌లో  సర్పంచ్‌ రిజ్వానా,ఎంపీటీసీ నాగరత్న, గ్రామస్తుల  ఆధ్వర్యంలో సీఎం. జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.  వారు మాట్లాడుతూ గతంలో పుంగనూరు నుంచి  ఏ.కొత్తకోటకు, అక్కడినుంచి చౌడేపల్లె, పలమనేరు వైపుకు వెళ్ళడానికిగోతులున్న  సింగిల్‌రోడ్డు మాత్రమే ఉండేది. ఎదురెదురుగా వాహనాలు వస్తే ఇక కష్టాలు చెప్పలేకుండేది.  పల్లెబాట కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి ప్రజలు తీస్రుకెళ్ళారు. స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు నుంచి  ఏ.కొత్తకోట మీదుగా దాదేపల్లె క్రాసు వరకు సుమారు 13 కిలోమీటర్ల దూరం, రూ:24 కోట్ల నిధులు, ఎండిఆర్‌ ప్లాన్‌ ద్వారా మంజూరు చేయించారు.పనులు శరవేగంగా  జరుగుతున్నాయి.మండలంలో మారుమూల గ్రామానికి డబుల్‌ రోడ్డు మంజూరు, సచివాలయ పక్కాభవనాలు, నాడు-నేడు ద్వారా ఉన్నతపాఠశాల అభీవృద్దితోపాటు సమీపంలో ఉన్న దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ అగస్తీశ్వరస్వామి కొండకు డబుల్‌రోడ్డు, ఆలయం వద్ద కోట్లాది రూపాయలతో వివ్యిధ అభివృద్దిపనులను చేశారన్నారు.ప్రజా సంక్షేమం కోసం గ్రామాల్లో రోడ్డులు, తాగునీరు, మౌళిక వసతుల కల్పనతోపాటు తమ గ్రామానికి ప్రత్యేక వన్నె తెచ్చిన మంత్రి పెద్దిరెడ్డి కుటుంభీకులకు రుణపడి ఉంటామన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా తోకపార్టీలు, ఎల్లోమీడియా ఒక్కటై పోరాటం చేసినా తామెప్పుడు వైఎస్సార్‌సీపీ వైపు ఉంటామని గ్రామస్తులు తెలిపారు. మండలంలోనే అభివృద్దితోపాటు  అత్యధిక మెజార్టీ సాధిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు మంజూరుకు కృషిచేసిన మంత్రి పెద్దిరెడ్డి కుటుంభానికి కృతజ్ఞతలు  తెలిపారు. ఈ కార్యక్రమంలో అగస్తీశ్వరస్వామి కమిటి చైర్మన్‌ రామరానాయణరెడ్డి,సర్పంచ్‌ల సంఘ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ చైర్మన్‌ వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీలు  చిన్నా,ధనలక్ష్మి,ఎంపీటీసీ శ్రీరాములు, మాజీ సర్పంచ్‌ విజయకుమార్‌రెడ్డి, సర్పంచ్‌లు సరస్వతి, ఓబుల్‌రెడ్డి, డిసిసిబి డైరెక్టర్‌ రమేష్‌బాబు, కో ఆప్షన్‌ మెంబరు సాధిక్‌భాషా,ఉప సర్పంచ్‌లు అల్తాఫ్‌, వినోద్‌రెడ్డి, నేతలురాజారెడ్డి,చెంగారెడ్డి, షఫీ, రఫీ,సద్దాం, రాజా,సత్యనారాయణ, జయరాం,రెడ్డెప్ప, బాస్కర్‌రెడ్డి, సదాశివ, చిట్టి తదితరులున్నారు.

Tags: We are indebted to the government for a developing world

Post Midle