విద్యార్థులకు రక్షణ కవచ ంలా ఉంటాం

We are like a protective shield for students

We are like a protective shield for students

– ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి

Date:19/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణానికి చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు పోలీసులు రక్షణ కవచంలా ఉంటామని ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి హామి ఇచ్చారు. శుక్రవారం ప్రభుత్వ కళాశాలలో విద్యార్థినీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ కళాశాలలో ర్యాగింగ్‌, టీజింగ్‌ నేరాలకు ఎవరు పాల్పడినా తమకు తక్షణం సమాచారం అందించాలన్నారు. అలాగే ఎలాంటి సమస్యలు ఎదురైనా తమకు తెలపాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిడికిలోనైన విద్యార్థులు తమ సమస్యలను ఇతరులతో పంచుకుని, పరిష్కార మార్గం ఆలోచించాలన్నారు. ఆవేషంతో ఆత్మహత్యలు చేసుకుంటే సమస్యలు పరిష్కారం కాదన్నారు. ఎంతో భవిష్యత్తునిచ్చిన తల్లిదండ్రులు ఆనాదలుగా మారిపోతున్నారని , ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించుకుని , సమస్యలను అధికమించేలా మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కమలాకర్‌రావు, అధ్యాపకులు హాజరైయ్యారు.

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

Tags: We are like a protective shield for students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *