మేమేమీ యుద్ధానికి వెళ్లట్లేదు : అచ్చెన్నాయుడు

Date:11/09/2019

అమరావతి  ముచ్చట్లు:

రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని.. అధికారంలో ఉండి బాధితుల శిబిరాన్ని ఏర్పాటు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నేడు ఆయనమాట్లాడుతూ ఐదేళ్లపాటు ఏం చేశారని నిలదీశారు. మీ ప్రభుత్వ పనితీరుపై జనం నవ్వుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను రక్షించుకునేందుకు జైలుకెళ్లడానికి కూడా తాముసిద్ధమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

 

 

 

తాము బాధితులను వాళ్ల ఇళ్లకు తీసుకెళ్తున్నామని… యుద్ధానికి వెళ్లడం లేదన్నారు. పోలీసు అధికారులు అన్ని విషయాలు ఆలోచించుకోవాలని, లేదంటే ఇబ్బంది పడతారని హితవు పలికారు.ఎందుకు ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు చెప్పేవారిని అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. అభిప్రాయాలు తెలియజేసే హక్కు కూడా లేదా?అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిమజ్జనంలో అపశృతి..ఆరుగురు చిన్నారుల మృతి

Tags: We are not going to war: Achchennaadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *