పదోన్నతలు కల్పించాలని వీఆర్‌వోలు ధర్నా

We are pleased to offer promotions

We are pleased to offer promotions

Date:19/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని వీఆర్‌వోలు తమకు పదోన్నతులు కల్పించాలంటు బుధవారం తహశీల్ధార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌వోలు సంజీవికుమార్‌, బద్రినాథ్‌ మాట్లాడుతూ బొప్పరాజు కమిషన్‌ను అమలు చేయరాదన్నారు.

 

దీని ద్వారా పదోన్నతుల్లో తీవ్ర నష్టం వస్తోందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేస్తున్న వీఆర్‌వోలకు పదోన్నతులు కల్పించడంలో వివక్షతకు గురౌతున్నామన్నారు. అలాగే సహాయ విఆర్‌ఏలకు నెల జీతం రూ.20 వేలు ఇవ్వాలని డిమాండు చేశారు.

 

ఈ విషయంలో పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో ఈనెల 15 నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరాహరదీక్షలు చేశామని, గురువారం కూడ నల్లబ్యాడ్జిలతో నిరసన , 24న విజయవాడలో ధర్నాచౌక నందు రాష్ట్రంలోని వీఆర్‌వోలతో కలసి ధర్నాలు , రిలే దీక్షలు చేస్తామన్నారు.

 

ఈ మేరకు తహశీల్ధార్‌ మాదవరాజుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకట్రమణ, ఆయిషా, ర మణ, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ముస్లింవెల్ఫేర్‌ సంఘంచే రక్తదాన శిబిరం

Tags: We are pleased to offer promotions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *