Natyam ad

బాధతో ,ఆవేదనతో నిరసన చేస్తున్నాం

హైదరాబాద్ ముచ్చట్లు:

దేశంలో ప్రజాస్వామ్యం పైనా పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. బాధతో ,ఆవేదనతో నిరసన చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  శుక్రవారం నాడు ధర్నా చౌక్ లో జరిగిన అఖిలపక్ష నిరసన కార్యక్రమంలో అయన పాల్గోన్నారు.
భట్టి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని దెవాలయంగా గుర్తించె భారత పార్లమెంట్ పైనా దాడి జరిగితే ప్రధాని ,హోంమంత్రి  ఒక ప్రకటన ఇవ్వాలని ఎంపీలు కోరారు. అసలు దాడే జరగనట్టు ప్రధాని వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ పైన దాడి అంటే దేశ ప్రజాస్వామ్యం పైన దాడి. దాడి పై సభలో చర్చ జరగాలి..వివరణ ఇవ్వాలని అడిగిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదని అన్నారు.
దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదు.. ప్రశ్నిస్తే జైళ్లు. పొగ బాంబులు వేసిన ఆగంతకులు ఇంకా వేరే దాడి చేసి ఉంటే ప్రపంచం దేశాల ముందు భారత్ చులకనగా మారేది. పార్లమెంట్ నే రక్షించలేని భారత ప్రభుత్వం… దేశ రక్షానను పూర్తిగా గాలికి వదిలేసింది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బోర్డర్ లో ఏదో ఒక అలజడి సృష్టిస్తారు. దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా ,రాహుల్ గాంధీ లు ప్రజలకు బాసట గా నిలిచారని అన్నారు.

Post Midle

Tags: We are protesting with pain and anguish

Post Midle