Natyam ad

మేము సిద్దం….మాబూత్‌ సిద్దం..- జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు

పుంగనూరు ముచ్చట్లు:

మేము సిద్దం…..మాబూత్‌ సిద్దం…అనే నినాదంతో మండలంలోని సింగిరిగుంట, మంగళం, భీమగానిపల్లె గ్రామాల్లో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. ఈ ప్రచారాలలో జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి , పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, బోయకొండ చైర్మన్‌ నాగరాజారెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలు విడుదల చేశారు. జెడ్పి చైర్మన్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రచారాలు చేపట్టామన్నారు. 30 ఏళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన పుంగనూరును ఐదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌గుర్తుపై వేసి వైఎస్సార్‌సీపీ పార్టీని అఖండ విజయంతో గెలిపించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, నాయకులు జయరామిరెడ్డి, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, రమణ, బాబు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Post Midle

Tags: We are ready….Mabooth is ready..- ZP Chairman Srinivasulu

Post Midle