సీఎం ఆదేశాలు అమలు చేయని అధికారులు మాకొద్దు..

-ప్రజా సమస్యలు పరిష్కరించే అధికారులు ముద్దు..
-మీసాల సుమలత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూల్ నగర అధ్యక్షురాలు

Date:16/01/2021

కర్నూల్ ముచ్చట్లు:

శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ముంపు బాధితులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించిన అధికారులు సీఎం ఆదేశాలు అమలు చేయని అధికారులు మాకొద్దని ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు, ఈరోజు కర్నూల్ నగరంలోని 48 వ వార్డు రోజా వీధిలో ప్రజాసమస్యలు పరిష్కరించే అధికారులు మాకు కావాలని. సీఎం ఆదేశాలు అమలు చేయని అధికారులు మాకొద్దని తెలిపారు.    దళిత నాయకుల పై అధికారులు అక్రమ కేసులు బనాయించడం తప్ప,. కుల వివక్షత, అంటరానితనం నిర్మూలించేందుకు కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు, కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో కుల వివక్షత, అంటరానితనం నేటికీ కోన సాగుతూ ఉందా లేదా కలెక్టర్, ఎస్పి చెప్పాలని కోరారు,
ప్రభుత్వ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కేసులు పెట్టాలని ,,
ప్రజాసమస్యలు పరిష్కరించాలని కోరే ప్రజా సంఘాల పై కేసులు పెట్టడం వల్ల ప్రభుత్వానికి వచ్చే చెడ్డ పేరుకు ప్రభుత్వ అధికారులే బాధ్యులని చెప్పారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags: We are the officers who do not implement the orders of the CM.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *