Natyam ad

మీకు  తోడునీడై ఉన్నాం – మంత్రి పెద్దిరెడ్డి 

పుంగనూరు ముచ్చట్లు:

నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి తోడునీడై మేము ఉన్నామని , ప్రజలకు ఏ సమస్య వచ్చిన తక్షణమే పరిష్కరించడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి , ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలో పలు కుల సంఘాల వారితో సమావేశం నిర్వహించారు. తొలుత మార్వాడి సేట్ల సంఘ నాయకులు ముఖేష్‌, కైలాష్‌ తదితరులతో సమావేశం నిర్వహించారు. అలాగే ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్యవై శ్యుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, వ్యాపారులపై కర్నాటక పోలీసుల బెదిరింపులను నియంత్రించామన్నారు. ఏ అవసరం వచ్చిన సేవ చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. వీరశైవ లింగాయతుల సంఘ నాయకుడు నాగరాజ ఆర్స్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రజక సంఘ నాయకులు మురుగేష్‌, హేమంత్‌, శోభ ఆధ్వర్యంలో జరిగిన కుల సమావేశంలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. మంత్రికి మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన మార్వాడి సేట్లకు అన్ని విధాల అండగా ఉండి , వారి వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తున్నామని తెలిపారు.

 

 

Post Midle

అలాగే వీరశైవలింగాయతుల కోరిక మేరకు తూర్పువెహోగశాల సర్కిల్‌ను బసవేశ్వర  సర్కిల్‌గా ఏర్పాటు, స్మశానవాటిక అభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రజకుల కోరిక మేరకు కమ్యూనిటి భవనానికి రూ.5 లక్షలు మంజూరు చేయడంతో పనులు జరగుతోందన్నారు. ఇంకను అవసరమైన సహాయం అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరు ఈనెల 13న తప్పకుండ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా మిధున్‌రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశాలలో మార్వాడి సేట్ల సంఘ నాయకులు  దినేష్‌, ఓంప్రకాష్‌, రణవీర్‌, ఆర్యవైశ్య సంఘ నాయకులు రెడ్డెప్పశెట్టి, పిఎల్‌.ప్రసాద్‌, బాబు, భానుప్రకాష్‌, లింగాయతుల నాయకులు రెడ్డెప్ప, శంకరప్ప, నంజుండప్ప, బసవరాజు, మంజు, రజక సంఘ నాయకులు శ్రీనివాసులు, రవి, నాగరాజ, భారతి, జయసుధ, కవితతో పాటు బలిజ సంఘ నాయకుడు తుంగా మంజునాథ్‌  తదితరులు పాల్గొన్నారు.

 

 

పట్టణ అభివృద్ధి…

 

పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. పుంగమ్మ చెరువు కట్టపై రూ.3 కోట్లతో పార్కును నిర్మించి, ప్రజల మానసిక ఉల్లాసానికి పెద్దపీఠ వేశామన్నారు. ఎంబిటి రోడ్డు విస్తరణ, బైపాస్‌ రోడ్డు, మిని బైపాస్‌రోడ్డు ఏర్పాటుతో పట్టణ రూపురేఖలు మారిందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దకంపెనీ జర్మన్‌ ఎలక్ట్రికల్‌ బస్సులు, ట్రక్కుల కంపెనీ ఏర్పాటుతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కర్నాటక సరిహద్దులో ఉన్న జాతీయ రహదారిని పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల వరకు అనుసంధానం చేశామని త్వరలోనే పనులు చేపడుతామన్నారు. రానున్న ఎన్నికల్లో రౌడీయిజం చేసి పోలీసులపైనే దాడులు చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి చల్లాబాబును ఓడించాలన్నారు. ప్రతి ఒక్కరు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి తమను గెలిపించాలని కోరారు.

Tags: We are with you – Minister Peddireddy

Post Midle