Natyam ad

జగనన్న పాలనలో రాజన్న స్వర్ణయుగం చూస్తున్నాం

–మహానేత రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణలో మంత్రి పెద్దిరెడ్డి
–ప్రపంచ దేశాలకే ఆదర్శం పథకాల అమలులో
— సచివాలయాలతో ఇళ్ళవద్దకే పథకాలు

చౌడేపల్లె ముచ్చట్లు:

Post Midle

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్వర్ణయుగం పాలనను చూస్తున్నామని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.సోమవారం కొలింపల్లె క్రాసు మూడురోడ్ల కూడళిలో రాజశేఖర్‌రెడ్డి క్యాంస్య విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి,ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ పార్టీ అధ్యక్షుడు, ఎంఎల్‌సీ భరత్‌ ,టిటిడి పాలక మండళి సభ్యుడు పోకల అశోక్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా రాజశేఖర్‌రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు ప్రపంచదేశాలకు ఆదర్శంగా నేటినీ నిలిచాయన్నారు. పేదల కష్ట సుఖాలను గుర్తించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమంగా ధ్యేయంగా పాలన సాగిస్తోందన్నారు. తండ్రి ఆశయాల సాధనకోసం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్విరామంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్ష్యేమ పథకాలను సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఇంటి గుమ్మం వద్దకే లబ్దిచేకూర్చుతున్నారని కొనియాడారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తి, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రుక్మిణమ్మ,సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి, వైస్‌ ఎంపీపీలు నరసింహులు యాదవ్‌, సుధాకర్‌రెడ్డి, కంట్రాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, పాల ఏకరి కార్పొరేషన్‌ రాష్ట్ర డైరక్టర్‌ లడ్డూరమణ,సర్పంచ్‌ సోని, ఎంపీటీసీ గంగులమ్మ తదితరులుపాల్గొన్నారు.

Tags: We are witnessing the golden age of Rajanna during the reign of Jagananna

Post Midle

Leave A Reply

Your email address will not be published.