శాయశక్తులా కృషి చేస్తున్నాం

Date:17/07/2018
యానం ముచ్చట్లు:
తూర్పుగోదావరి పశువుల్లంక పడవ ప్రమాదంలో గల్లంతైన బాలికల ఆచూకీకై శాయశక్తులా కృషి చేస్తున్నాం. బాధిత కుటుంబాలకు అండగా వుంటాం. బేస్ క్యాంప్ ను సముద్ర తీరంలోని   సావిత్రి  నగర్ , భైరవపాలానికి మార్చామని డిప్యూటి సిఎం ,హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.  మంగళవారం నాడు నాలుగో రోజు  కొనసాగుతున్న గాలింపు చర్యలను బోటు పై వెళ్ళి స్వయంగా పరిశీలించారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. పశువుల్లంక పడవ బోల్తా ఘటన చాలా దురదృష్టకరం.గల్లంతైన ఏడుగురులో రెండు మృత దేహాలే  లభ్యమయ్యాయి. ఐదుగురు బాలికల ఆచూకీకై  నిరంతర అన్వేషణ కొనసాగుతోందని అన్నారు. సముద్ర మొగ భైరవపాలెం తీరంలో 15 బోట్లలో  19 బృందాలు గా 250 మంది గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. బాధిత కుటుంబాల ఆవేదన తీర్చలేనిది. నాలుగు రోజులు గా ఆ కుటుంబాలు  తీవ్రమనోవేదన పడుతున్నాయి. పడవ బోల్తాకు కారుకుడైన  బోటు యజమాని, నిర్వహకులను అరెస్టు చేశామని అన్నారు. సురక్షితంగా గోదారి ప్రయాణాలు చేయిస్తాం.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపడతామన్నారు. గోదారి లంక రేవులలో బోట్ల పై ప్రయాణించే ప్రయాణికులకు  లైఫ్ జాకెట్లు వేసుకునేలా చర్యలు చేపడతాం. లంకల్లో బోట్లు స్థానంలో పంట్లు వేయాలని నిర్ణయించామని అన్నారు.
శాయశక్తులా కృషి చేస్తున్నాంhttps://www.telugumuchatlu.com/we-are-working-hard/
Tags; We are working hard

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *