We ate liquor bottles at government liquor stores.

ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యం సీసాలు మాయం.

-అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకున్న సిబ్బంది.
* పలు మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలపై ఎక్సైజ్ అధికారులు తనిఖీలు.
* లాక్ డౌన్ కు ముందు ఇప్పటికీ మద్యం స్టాక్ లో భారీ తేడాలు.

Date:20/04/2020

సత్యవేడు ముచ్చట్లు:

సత్యవేడు ఎక్సైజ్ పరిధిలోని పలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం బాక్సులు మాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఎక్సైజ్ పరిధిలో సత్యవేడు, వరదయ్యపాలెం, నాగలాపురం, పిచ్చాటూరు మండలాలకు సంబంధించి 27 మద్యం దుకాణాలు నడుస్తోంది. కరోనా విపత్తు నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత నెల 22వ తేదీ లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాలను మూసివేసి సీలు వేయడం జరిగింది. దీంతో మద్యానికి బానిసలైన మద్యం ప్రియులు కొందరు మద్యం కోసం వెతుకులాట ప్రారంభించారు.మద్యం షాపుల్లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది ఇదే అదునుగా భావించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నిల్వ ఉన్న మద్యంపై కన్నేశారు. లాక్ డౌన్ ముసుగులో మూడో కంటికి తెలియకుండా మద్యం బాక్స్ లకు బాక్సులను షాపు నుంచి రహస్య ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు మద్యం సీసాలను అమ్ము కున్నట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు మద్యం నిల్వలు దారి మల్ల కుండా చూడడం మానేసి కంచే చేనును మేసిన చందాగా మారిపోయారు.

 

 

 

దీంతో ఎక్సైజ్ పరిధిలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వందలాది మద్యం బాక్సులు మాయమయ్యాయి.ఇష్టానుసారం మద్యం బాటిల్స్ ను అమ్ముకోవడానికి బరితెగించారు.ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నిబంధనల మేరకు మద్యం(180)ఎంఎల్ బాటిల్ ను బ్రాండ్ అనుసరించి 120 రూపాయల వరకు విక్రయిస్తున్న ప్రస్తుతం ఏకంగా 300 రూపాయల వరకు అమ్మి జేబులు నింపుకుంటున్నారు.అలాగే ఫుల్ బాటిల్ మద్యం సీసాను 2000 రూపాయల పైనే అమ్ముకున్న టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణల నేపథ్యంలో స్థానిక ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగి పలు మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలపై గత వారం గా తనిఖీలు చేసి వివరాలు సేకరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మండల పరిధిలోని దాసుకుప్పంలో 7 మద్యం షాపులు నడుస్తుండగా ఒక్క షాపులోని దాదాపు రెండున్నర లక్ష రూపాయలు విలువ చేసే మద్యాన్ని అక్కడ సిబ్బంది అమ్మినట్టు అధికారుల తనిఖీల్లో బయటపడ్డ టు తెలిసింది.

 

 

 

ఇదేగాక సత్యవేడు ఎక్సైజ్ పరిధిలో దాదాపు 50 శాతం వరకు మద్యం సీసాలు దారి మళ్లీనట్టు సమాచారం. దీనిపై సంబంధిత ఎక్సైజ్ సిఐ రామచంద్రను వివరణ కోరగా పలు మద్యం షాపుల్లో మద్యం సీసాలు మాయం కావడం వాస్తవమేనన్నారు. మద్యం నిల్వలపై తనిఖీలు చేయగా కొన్ని మద్యం సీసాలను సిబ్బంది అక్రమంగా అమ్మినట్టు తేలిందన్నారు. దారి మళ్లిన మద్యం సీసాలు సంబంధించి వాటి విలువను లెక్కించి సంబంధిత మద్యం దుకాణాల సూపర్వైజర్ నుంచి రికవరీ చేస్తున్నామన్నారు. దీనిపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపి వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

గుర్రంకొండ లో భూప్రకంపనలు

Tags; We ate liquor bottles at government liquor stores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *