రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం : కలెక్టర్

Date:30/03/2020

సిరిసిల్ల  ముచ్చట్లు:

ఏప్రిల్‌ 7 వరకు క్వారంటైన్‌లో ఉన్న వారు బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యతను స్థానిక ప్రజలు తీసుకోవాలి. జిల్లాలో రైతులు తమ పొలంలో పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు.

 

సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మీటింగ్ హాల్లో కరోనా వైరస్ నువ్వు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు , మొక్కజొన్న , ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వపరంగా చేస్తున్న ఏర్పాట్లను వివరించేందుకు జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్ , ఎస్పి  రాహుల్ హెగ్డే తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కరోనా నేపథ్యంలో రైతులకు టోకెన్లు జారీ చేసి విడతల వారీగా గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు చేస్తా మన్నా రు. రైతులంతా క్రమశిక్షణతో జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. ఒకేరోజు అందరి ధాన్యం కొనుగోలు సాధ్యం కాదనీ పేర్కొన్నారు. అందువల్ల టోకెన్‌పై ఉన్న తేదీ ప్రకారమే రైతులు ధాన్యం అమ్మకానికి రావాల్సి ఉంటుందనీ కలెక్టర్ అన్నారు.

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా లో మొత్తం 13 మండలాలలో 1,32,992 ఎకరాలలో రబీ 2019-20 కాలానికి వరి పంటని పండించడం జరిగింద న్నారు. ఈ సీజన్ లో మొత్తం 3,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యము కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నామ న్నారు.  జిల్లా లో వరి కోతలన్నియు రైతులు నియంత్రిత పద్దతి లో చేయాలని కోరామన్నారు. జిల్లా లోని వ్యవసాయ విస్తరణ అధికారులు,  గ్రామ రెవిన్యూ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు , మండల తహసిల్దార్లు , గ్రామ, మండల, రైతు బంధు సభ్యులు, కోఆర్డినేటర్లు అందరూ సమన్వయముతో ఆయా గ్రామాలలోని రైతులకు టోకెన్లు జారీ చేసి, దాని ప్రకారం రైతులు వరి ధాన్యం కోసి, సెంటర్లకు తీసుకు రావాల్సి ఉంటుంద న్నారు.

 

 

జిల్లా లోని వ్యవసాయ అధికారులు, హర్వేస్టర్లు ( వరి కోత యంత్రాలు ) సిద్దం చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం జిల్లా లో 141 హర్వేస్టర్లు( వరి కోత యంత్రాలు ) అందుబాటులో ఉన్నాయి. మరిన్ని హర్వేస్టర్లను ( వరి కోత యంత్రాలను ) ఇతర జిల్లాల లేదా ఇతర రాష్ట్రాల నుండి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రైతులందరూ ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా ఉండవలసినదిగా కోరడంతో పాటు ప్రతి ధాన్యం గింజను ప్ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలియజేస్తున్నాము. రైసు మిల్లర్ యజమానులు , మధ్యవర్తులు కూడా వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధర రైతులకు చెల్లించి రైతుల దగ్గర కొనుగోలు చేయవచ్చు నీ అన్నారు.

 

 

వ్యవసాయ మార్కెట్ యార్డులలోకి రైతులు ధాన్యం తీసుకురాకూడదన్నారు. మార్కెట్ యార్డులలో ధాన్యం కొనుగోలును పూర్తిగా నిలిపి వేయడం జరిగిం దన్నారు.
అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పూర్తి వసతులు కల్పించడంతో పాటు, సానిటేషన్ చేయించవలెను. కొనుగోలు కేంద్రాలలో, అందరూ సామాజిక దూరం పాటించవలెను , ఇందుకు గాను పోలిస్ శాఖ వారిని తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరడమైనది. ఎట్టి పరిస్థితులలో, సంబంధిత రైతులు , హమాలీలు, ట్రాన్స్ పోర్ట్ వ్యక్తులు , కొనుగోలు కేంద్రాలలో పని చేసే సిబ్బంది మినహా ఇతరులు కొనుగోలు కేంద్రాలలోకి అనుమతించబడరు.

 

 

ధాన్యం కొనుగోలు కేంద్రాలలోకి అవసరమైన హమాలీలను స్థానిక గ్రామాల నుండి సమకూర్చుకోవలసి ఉంటుంది. కొనుగోలు కేంద్రం నుండి రైసు మిల్లులకు ధాన్యం రవాణాకు అదనపు లారీలు సమ కూర్చుకోవలసిందిగా ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేయడమైనది . రైసుమిల్లులో కూడా హమాలీలను త్వరగా సమకూర్చుకొని వచ్చిన ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవలసిందిగా కోరడమైనది.

 

తదుపరి నిత్యావసర వస్తువుల విషయంలో ఏమైనా కొరత గానీ , అధిక ధరలకు అమ్మినా గానీ, కంట్రోల్ రూమ్ నెం . 630914 1122, 08723- 231166 కి ఫిర్యాదు చేయవచ్చు. అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోబడును. వలస కార్మికులకు అన్నివిధాలుగా జిల్లా యంత్రాంగం అండగా ఉంటుంది.
జిల్లాలో వలస కార్మికుల సంఖ్యను గుర్తించేందుకు సర్వే చేయించగా 4998 మంది ఇటుక బట్టీలు, నిర్మాణరంగం ,ఇరిగేషన్ ప్రాజెక్టుల లో పని చేస్తున్నట్టు తేలిందన్నారు. వీరిలో పలువురు భోజనం వండి ఇవ్వాల్సిందిగా, పలువురు రేషన్ ఇవ్వాల్సిందిగా, మరి కొంతమంది షెల్టర్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారని కలెక్టర్ తెలిపారు.

 

 

 

వారు కోరిన విధంగా భోజనం అందించడం, రేషన్ జిల్లా యంత్రాంగం ఇస్తుందన్నారు. అలాగే వలస కార్మికులకు జిల్లా యంత్రాంగం షెల్టర్ సౌకర్యం కల్పిస్తుo దన్నారు. డయాబెటిస్, బిపి ,తదితర ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే కార్మికులకు అవసరమైన మందులను, వైద్య సేవలను ఉచితంగా అంది స్తమన్నారు. జిల్లాలో బువ్వ లేకుండా పస్తులు ఉండే పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతూ … వలస కార్మికులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

 

 

అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఉచిత భోజనం
అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ క్యాంటీన్ ల ద్వారా రూ. 5 రూపాయలకే భోజన సౌకర్యం కల్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
కరోనా నేపథ్యంలో సకలం బంద్ అయిన నేపథ్యంలో అన్నపూర్ణ క్యాంటీన్ ల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పట్టణాలలోని వీధుల్లో ఉండే అభాగ్యులకు స్వయంగా వెళ్లి భోజనము అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిరు పేద ప్రజలు అన్నపూర్ణ క్యాంటీన్ ల ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

 

క్వారంటైన్‌లో ఉన్న వారు బయటకు రాకుండా చూడాలి
జిల్లాలో క్వారంటైన్‌లో 1032 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు వీరందరి పాస్పోర్ట్ లను ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి పాస్ పోర్ట్ లను రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. కరోనా వ్యాధి లక్షణాలు బయ ట పడే వ్యవధి రెండు రోజుల నుంచి 14 రోజుల వరకు ఉంటుంది అన్నారు. విదేశాల నుంచి మన జిల్లాకు వచ్చిన చివరి వ్యక్తి మార్చి 22వ తేదీన వచ్చాడని కలెక్టర్ తెలిపారు.

 

జిల్లాలో క్వారంటైన్‌లో ఉన్న 1032 మందినీ ఏప్రిల్ 7వ తేదీ దాకా బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజలు దేని కలెక్టర్ పేర్కొన్నారు . దక్షిణ కొరియా దేశం లో కరోనా వ్యాధి సోకిన ఒక వ్యక్తి , అదేశంలోని 59 వేల మందికి కరోనా వ్యాధి సోకేలా చేశారని కలెక్టర్ తెలిపారు. నిర్లక్ష్యంగా ఉంటే మన దేశం మన రాష్ట్రం, జిల్లా కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందన్నారు.
జిల్లాలో ఇంకా 673 మంది స్వీయ గృహ నిర్భంధం పూర్తి చేయాల్సి ఉందన్నారు. వీరందరూ తప్పకుండా పూర్తి కాలం పాటిం చే లా చూడాలన్నారు.

 

 

 

ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర గ్రామాల నుంచి తమ గ్రామంకు వచ్చే వ్యక్తులను కూడా గ్రామ ప్రజలు స్వీయ గృహ నిర్భంధం లో ఉంచేలా చూడాలన్నారు. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఉన్నంతకాలం స్వీయనిర్భందంలో ఉండాలని కోరారు.

’’మన పుంగనూరు కమిషనర్‌ లోకేశ్వరవర్మ ’’

Tags: We buy every nut that the farmers cultivate: the collector

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *