Natyam ad

ఆఖరి గింజ వరకు కొంటాం

మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్


మహబూబాబాద్ ముచ్చట్లు:


మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం ఖానాపూర్ గ్రామంలో ప్రాథమిక రైతు సేవా సహకార సంస్థ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని,  మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం బీసీ తండాలో ఐకేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని,  మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర లో ప్రాథమిక రైతు సేవా సహకార సంస్థ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేర్వేరుగా ఆయా చోట్ల రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  శనివారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా మేళతాళాలతో మంత్రులకు రైతులు కి ఘనంగా స్వాగతం పలికారు.
మంత్రులు మాట్లాడుతూ బీజేపీ పార్టీ దొంగల పార్టీ. ప్రభుత్వాలను కూల్చే పని పెట్టుకుంది. రైతాంగాన్ని, ప్రజలను మోసం చేస్తున్నది. తెలంగాణ పై కక్ష కట్టింది. కేంద్ర మంత్రులు అబద్ధాలు మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందిందని అన్నారు.

 

 

Post Midle


రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన మహాత్ముడు సీఎం కేసీఆర్. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శం. ఆడబిడ్డకు మేనమామ గా కళ్యాణాలక్ష్మి పథకం. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయిదు వందల పెన్షన్ కూడా రావడం లేదు. మన రాష్ట్రంలో 3 వేళా రూపాయల పెన్షన్ ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి నీళ్లు అందించిన మహాత్ముడు సీఎం కేసీఆర్అని అన్నారు.
సాగు నీరు, మంచినీరు, 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు పంటలు బాగా పండి, దిగుబడి పెరగడానికి కారణం సీఎం కెసిఆర్. రైతులు పండించిన ప్రతి గింజను మన ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ప్రతి ఏటా 3 వేల కోట్లు నష్టం వచ్చినా భరిస్తూ, సీఎం కెసిఆర్ గారు కొనుగోలు చేస్తున్నారు. లట్టుంగాడు, పొట్టుంగాడు వచ్చి వరి వేయమన్నరు. తీరా టైం కు చేతులు ఎత్తేసిండ్రు. చేసేది లేక మళ్ళీ మన సీఎం కెసిఆర్  రైతులు నష్ట పోవద్దని ధాన్యం కొంటున్నాడు. దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. పక్క రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి. పక్క రాష్ట్రాల రైతులు మన రాష్ట్రంలో పుట్టనందుకు బాధ పడుతున్నారు.

 

 

 

కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్ర చేసింది. నా బొంది లో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టనివ్వనని తేల్చి చెప్పిన మహానుభావుడు సీఎం కెసిఆర్. ఒక్కో మీటర్ కు వేలాది రూపాయల బిల్లు వస్తున్నది. రైతులు లాభ పడాలన్నదే సీఎం కెసిఆర్ లక్ష్యం. రైతులు, బాగా డిమాండ్ ఉండే ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. ఎకరాకు లక్షా 40 వేల వరకు ఆదాయం వస్తున్నది. నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా ఆయిల్ పామ్ నర్సరీ, నూనె తీసే ఫ్యాక్టరీ పెట్టిస్తున్నా. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చూడాలి. సమస్యలు వస్తే వెంటనే వాటిని పరిష్కరించాలి. టోకెన్లు ఇవ్వండి. పద్ధతి ప్రకారం, ప్రతి గింజ కొనాలి. ఎవరైనా వచ్చి రెచ్చ గొడితే తెచ్చి పోవద్దు. ఆఖరి గింజ వరకు కొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Tags: We buy to the last grain

Post Midle