మన నీటికోసం ఎంతకైనా పోతాం

అలంపూర్ ముచ్చట్లు:

 

ఏరువడ్డదే నీళ్లకోసం.  ఓ వైపు కృష్ణ, ఓ వైపు తుంగభద్ర నదులు పెట్టుకొని నీళ్ల కోసం గోసపడ్డ ప్రాంతం నడి గడ్డ.  బంగారం పండే భూములున్నా సమైక్య రాష్ట్రంలో మన నీళ్లు మనకు దక్కని దయనీయ స్థితి.  వ్యవసాయమే మన జీవనాధారమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.  శుక్రవారం నాడు మంత్రి – జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల కేంద్రంలో రైతు వేదిక ను ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం,  జెడ్పి చైర్ పర్సన్ సరిత,  అడిషనల్ కలెక్టర్ హర్ష , తదితరులు హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ  నీళ్ల కోసం నడిగడ్డ ఎన్ని ఇబ్బందులు పడిందో తెలుసు.  నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైంది..నీళ్ల కోసమే ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నది.  రాష్ట్రం విడిపోయాక కూడా వాళ్ళ బుద్ధి పొనిచ్చుకోవట్లేదు .. వాళ్ళ హక్కు ఎంతనో అంత వాడుకుంటే ధర్మం .. కానీ వాళ్ల నీళ్లు వాడుకుని .. మన నీళ్లనూ కావాలంటున్నారు.  కృష్ణా నదిలో ఎవరు ఎన్ని నీళ్లు వాడుకోవాలో నిర్ణయించడానికి అపెక్స్ కౌన్సిల్,కృష్ణ నది యాజమాన్య బోర్డ్ వుంటుంది.  కొత్త ప్రాజెక్టులు ఏమైనా కట్టాలి అంటే కేంద్రం నుండి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుందని అయన అన్నారు.

 

 

 

 

పాలమూరు రంగారెడ్డి పాత ప్రాజెక్ట్ …గత ప్రభుత్వం హయాంలోనే మనకు అనుమతి వచ్చింది.దాని ఆధారంగా నే మనము ముందుకు పోతున్నాం.  ఏపీ కొత్తగా గండి పెడతా మంటుంది..నది మధ్యలో నుండి నీటిని తోడుకొని పోవాలని చూస్తోంది.  కోర్ట్ లో కేస్ వేస్తే అన్ని అనుమతులు వచ్చే వరకు సంగమేశ్వరం ప్రాజెక్ట్ పనులు చేపట్టము అని చెప్పారు.  గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినపుడు అన్ని రకాల అనుమతులు వచ్చే వరకు ఎటువంటి పనులు చేపట్టం అని ఏపీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా తెలిపింది. – రాసి ఇచ్చారు కానీ..యధావిధిగా పనులు ప్రారంభించారు . మన నీటి హక్కుల కోసం ఎంత దూరమైనా పోతాం.  వాటా కు మించి శ్రీశైలం నుండి నీళ్ళు తీసుకుపోవాలనే ప్రయత్నాలను అడ్డుకుంటాం.  మన నీళ్లు కిందకు పోయే లోపే ఏం చేయాలో ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆలోచిస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నది నుండి రావాల్సిన నీటివాటాలో ఒక్క చుక్క నీటిని కోల్పోవడానికి సిద్ధంగా లేమని అన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: We can do anything for our water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *