మంత్రి ఈటెల రాజేందర్ పై తప్పుడు కథనాలను ఖండిస్తున్నాం

We condemn the false stories on the spear Rajender

We condemn the false stories on the spear Rajender

– ఓయూ విద్యార్థి సంఘాలు

Date:26/08/2019

హైదరాబాద్  ముచ్చట్లు:

మన తెలంగాణ ఆంధ్రప్రభ పత్రికలు మంత్రి ఈటల రాజేందర్ గారిపై తప్పుడు కథనాలను రాయడాన్ని ఓయూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ ఆరోపణలు చేయడం అణగారిన వర్గాల గొంతుక అయిన మంత్రి ఈటలపై పనికట్టుకుని బద్నాం చేయడమేనని ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి  మంత్రి నిజాయితీగల వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నమేనని ఇప్పుడిప్పుడే ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాలు రాజకీయంగా చైతన్యవంతులై తుంటే వారి గొంతులను తుంగలో తొక్కాలని వారు బలపడితే అగ్రవర్ణాల పీటలు కదులుతాయని గుర్తించి మంత్రి వ్యక్తిత్వాన్ని

 

 

 

 

 

కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని దేశంలోనే బలమైన బీసీ నేతగా ఉన్న ఈటల రాజేందర్ గారిని తక్కువ చేస్తే మిగతా బీసీ వర్గాలు భయపడి రాజకీయ పదవులు రాజకీయ హక్కులు అడగకుండా ఉంటారని దీని వెనకాల అగ్రవర్ణాల కుట్ర దాగి ఉందన్న నిజాన్ని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాలు గుర్తించాలని విద్యార్థి నాయకులు కోరారు  ఇలాంటి చిల్లర కథనాలు పురా పునరావృతం అయితే దేనికైనా తెగిస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో ఓయు జేఎసి చైర్మన్ మందాల భాస్కర్, ఎల్చల దత్తాత్రేయ రాష్ట్ర అధ్యక్షులు ఎంబిసి విద్యార్థి సంఘం,డాక్టర్ నెహ్రూ  నాయక్

 

 

 

 

 

గిరిజన విద్యార్థి సంఘల చైర్మన్ పుల్లారావు యాదవ్ పుప్పాల మల్లేశ్ కాపు విద్యార్థి సంఘం, వెంకట్ మాదిక విద్యార్థి సంఘం,డా.గుండ్లపల్లి శ్రీనివాస్,స్వామి గౌడ్ బిసి విద్యార్థి సంఘం సలీం పాషా మైనారిటీ విద్యార్థి సంఘం,రెడ్డి శ్రీను జెవిఎస్, చిరంజీవి బెస్త ,రాస వెంకట్,జంపాల రాజేష్ టీఎస్ఫ, ఎర్రవెల్లి జగన్ జెఎన్యు ప్రెసిడెంట్ చేన్నయ్య, అల్లుడు జగన్, పండుగ బాలు  ఓయూ జేఏసీ నాయకులు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ  విద్యార్థి సంఘాల నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

 

స్కూళ్లలో  కనిపించని  సబ్జెక్టు టీచర్లు

 

Tags: we-condemn-the-false-stories-on-the-spear-rajender

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *