పరిసర ప్రాంత వాసుల ఆగడాలు, చిత్ర హింసలు భరించలేకున్నాం

– స్థానిక పోలీసుల న్యాయం కరువు-
– ఆత్మహత్యలే శరణ్యం. పేడూరు గ్రామ బాధిత కుటుంబీకుల ఆక్రందన

 

నెల్లూరు ముచ్చట్లు :

 

తమ ఇంటి పరిసర ప్రాంత వాసుల ఆగడాలు, చిత్ర హింసలు భరించలేకున్నామని నెల్లూరు జిల్లా, తోటపల్లిగూడూరు మండలం, పేడూరు గ్రామ బాధిత కుటుంబీకులు తమ గోడును వెల్లడించారు. నెల్లూరు నగరంలోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెట్టెం బాక ఉమా మహేశ్వరి మాట్లాడుతూ తన భర్త  నెట్టెం బాక రాజయ్య, కూతురు వెంకట సుధ, కుమారుడు వెంకట లోకేష్ లతోపాటు గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో తమ ఇంటికి ఎదురుగా ఉన్న రామా వర్తుల .చంద్రయ్య కుటుంబీకులు తమ ఇంటి పై రాళ్లు వేయడం, ఇంట్లోకి తొంగి చూడడం, ఎంగిలి ఇస్తరాకులు ఇంట్లోకి విసిరేయడం, ఫోటోలు, వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే వారిని ఆరోపించారు.

 

 

 

 

ఈ విషయమై వాళ్లని నిలదీయగా కత్తులతో ను, కర్రలతో ను కొట్టేందుకు తమ ఇంటి పైకి  వచ్చేవారిని  తెలిపారు .ఇది ఇలా ఉండగా మా ఇంటికి దక్షిణం వైపున నివాసం ఉంటున్న లేబూరు కవిత ఆమె భర్త వేణు, కుమార్తె కీర్తి మరియు నెట్టెం బాక వెంకటరత్నం లు ,మా ఇంట్లోకి వెళ్ళే దారికి అడ్డంగా ఆటోలు, వ్యాన్లు పెట్టడమే కాకుండా, ఇదేమని అడిగితే  ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారా అంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఈ విషయమై విచారించి తగు న్యాయం చేయాలని స్థానిక తోటపల్లిగూడూరు మండలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. విచారణ చేపట్టాల్సిన పోలీసు అధికారులు మా కుటుంబ సభ్యులను స్టేషన్కు పిలిపించి, సభ్య సమాజం తలదించుకునేలా అమ్మనా బూతులు తిట్టడమే  కాకుండా , మేము ఆరోపించబడిన వ్యక్తుల చేతనే మాపై అక్రమ కేసులు బనాయించారని తెలియజేశారు.

 

 

 

 

వీరికి స్థానిక రాజకీయ నాయకులు తూపిలి ఉదయ్ కుమార్ రెడ్డి  అండగా ఉన్నాడనే ధీమాతో పోలీసులు కూడా , మేము ఆరోపించబడిన వారికే సపోర్ట్ చేస్తున్నారని తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఈ క్రమంలో మనోవేదన  గురైన మా కుటుంబ సభ్యులు అయినటువంటి నా భర్త రాజయ్య, కూతురు వెంకట సుధా( ఎమ్మెస్సీ కంప్యూటర్స్), కుమారుడు వెంకట లోకేష్( డిగ్రీ) లకు ఆత్మహత్యలు చేసుకోవాలనే ప్రేరణ కలుగుతుందన్నారు. మా ఆత్మ హత్యలకు  గ్రామస్తులు అయిన రామావర్తుల చంద్రయ్య, తన భార్య సుజాతమ్మ, ఆయన కుమారుడు గోపికాంత్ లతోపాటు లేబూరు కవిత, ఆమె భర్త వేణు, కుమార్తె కీర్తి మరియు నెట్టెం బాక వెంకటరత్నం లతోపాటు  తోటపల్లిగూడూరు పోలీసులే కారకులవుతారు అని తెలియజేశారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి విచారణ చేపట్టి, తమ కుటుంబానికి తగు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అధికారులకు మనవి చేసుకున్నారు.

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: We could not bear the harassment and film violence of the surrounding people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *