మంచినీటి సమస్య లేకుండ చేస్తాం

We do not have a problem with fresh water

– కమిషనర్‌ వర్మ

Date:21/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో మంచినీటి సమస్య లేకుండ చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. బుధవారం ఆయన పట్టణంలో పర్యటించారు. మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలలో అదనంగా బోర్లలో పైపులు వేసి, నూతనంగా బోర్లు వేసి, నీటిని కొళాయిల ద్వారా సరఫరా చేస్తామన్నారు. ముఖ్యంగా పట్టణంలోని పలు ప్రాంతాలలో కొళాయిలకు కరెంటు మోటార్లు పెట్టి, నీటిని తోడుతున్నారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇరుగుపొరుగు వారికి మంచినీటి సరఫరా జరగకుండ ప్రజలు ఇబ్బందులకు గురౌతారని తెలిపారు. అలాగే కొన్ని ప్రాంతాలలో మంచినీటి కొళాయిల నుంచి నీటిని వృధా చేస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రజలు అవగాహన పెంచుకుని, నీరు వృధా కాకుండ చూడాలన్నారు.

పారిశుద్ధ్య కార్యక్రమాలు….

పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. కౌండిన్య నది ప్రాంతంలో కలుపు మొక్కలను తొలగించి, మురుగునీటిని తొలగించారు. బుధవారం ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ చిత్తూరులో కమిషనర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా మాట్లాడుతూ పుంగనూరులో ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధిస్తూ, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ప్లాస్టిక్‌ నిషేధించి , పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని ఆదేశించారని తెలిపారు. అలాగే భూగర్భజలాలను పెంపొందించుకునేందుకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని, పట్టణంలో విరివిగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఇంటి వద్ద ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారని తెలిపారు. అలాగే మంగళ, శనివారాల్లో రెండు రోజుల పాటు పొడి చెత్తను మాత్రం అనగా ప్లాస్టిక్‌ వస్తువులు, ఇనుప వస్తువులు మాత్రమే మున్సిపల్‌ కార్మికులకు అందజేయాలని ఆయన తెలిపారు. అలాగే ప్రతి నెల చివరి శనివారం పాఠశాలలు, కళాశాలల్లో వీటిపై అవగాహన ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలన్నారు.

పార్టీ నేతలతో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి సమావేశం

Tags: We do not have a problem with fresh water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *